పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182 సింహాసన ద్వాత్రింశిక

న్మీరు చరించిన యాకా
శ్మీరంబున నేమి గలవు చిత్రము లనినన్. 85

సీ. వసుధేశ యచ్చట వైశ్యుండు ధనపతి
యోజనాయతమైన యొక్కచెఱువు
గట్టించి లోతుగాఁ గావింప నందులోఁ
బుడిసెఁడునీళ్ళును బొడమకున్న
వగచి యింటికిఁ జని మగిడి నిచ్చలు నట్ల
వచ్చి యాకట్టపై వెచ్చనూర్చు
చుండగా ముప్పదిరెండులక్షణములు
గలవానికంఠరక్తంబు లిమ్ము
ఆ. చెఱువు నిండు ననుచుఁ జెప్పె నంబరవాణి
దాని కాతఁ డట్టివానిఁ గూర్పఁ
బూని యేడుకోటు లైన బంగారునఁ
బ్రతిమ లేడు నిలిపెఁ, బద్య మొకటి. 86

ఆ. “అవనిఁ ద్రిదశలక్షణాన్వితుఁ డగుధీరుఁ
డిచటఁ గంఠరక్త మిచ్చెనేని
సప్తకోటిమూల్యతప్తకాంచనముల
ప్రతిమ లేడు నతని పాలు సుమ్ము.” 87

మ. అని యిట్టున్నది విస్మయం బిది నృపాలాగ్రేసరా నావుడు
న్విని యుత్సాహముతోడఁ దత్సహితుఁడై విశ్వంభరాధీశుఁడుం
జని యచ్చోటఁ దటాకమధ్యమున గర్జన్మర్దళధ్వానసం
జనితశ్రీరమణీప్రసాదవిలసత్సౌధంబు వీక్షించుచున్[1]. 88

  1. శ్రీరమణీకటాక్ష విలసత్స్థానంబు వీక్షించుచున్
    ప్రసాదమగు నాసౌధంబు వీక్షించుచున్