పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154 సింహాసన ద్వాత్రింశిక

వలయు నటంచుఁ గోరి యుదవాసమునందుఁ దపంబు సేయుచు
న్నిలుచుటఁగాక యెప్పుడును నీటఁ జలిం బడనేల వానికిన్. 43

ఆ. ఇట్టికన్య నాకు నిచ్చెద రమ్మని
దానితండ్రి తొల్లి తగినవారిఁ
బనిచినాఁడు గానఁ జనియెద ననుడు ర
త్నోద్భవుండుఁ దాను నుత్సహించి. 44

క. ఆతరుణి యెవ్వరికి నౌ
నాతనిబ్రదు కొప్పు ననుచు ననుర క్తి మనో
జాతునిజేతలఁ బడల న
తీతము మును విన్నభంగి దిట్టతనమునన్. 45

క. ఆకన్నియఁ దజ్జనకుఁడు
నా కిచ్చెద నంచు మొన్న నయముం బ్రియముం
గైకొనఁగఁ జెప్పి పుచ్చిన
నాకడ కే నేఁగుచంద మది యెఱుఁగవొకో. 46

వ. అనుడు మత్సరసముత్సేకంబున. 47

క. అతని పలుకులకు నాతం
డతికుపితుండైన వాఁడు నధికక్రోధా
న్వితుఁ డయ్యెను "మూలం వై
రతరోః స్త్రీ" యనినమాట ప్రకటంబయ్యన్. 48

శా. అన్యోన్యం బిటు దూలుచు న్మనమునం దందేఁగుచో[1] నెవ్వనిం
గన్యారత్నము గోర దాతఁడు కులోత్కర్షంబు వాణిజ్యమున్

  1. న్మనమె నేఁడం దేగుచో