పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148 సింహాసన ద్వాత్రింశిక

క. చంపుడుగుడి[1] యిది యనియా
దంపతులకళేబరములుఁ దలలుం గని త
త్సంపాదితభయరౌద్రా
కంపితుఁడై సెట్టి బెగడి కన్నులు మూసెన్. 17

క. తదనంతరంబ చెదరిన
హృదయముఁ దనలోన నెట్టకేలకు[2] నిలువం
బొదపెట్టి వెడలి యొకబా
రి దొలఁగెనని విడిడలకుఁ దిరిగి చనుదెంచెన్. 18

క. ఆరే యచటం బుచ్చి వి
కారవిహీనాత్ముఁ డగుచుఁ గలమునఁ బారా
వారము నడిమికిఁ జని యా
ద్వారావతిపురము సొచ్చి తత్సౌధములోన్. 19

మహాస్రగ్ధర. కనియె న్భూపుత్రజిష్ణున్ ఘనదురీతమహాఖండనావిర్భవిష్ణున్
వనమాలాలంకరిష్ణున్ ప్రజవనవిహరద్వల్లనీకేలితృష్ణున్
దనుజేంద్రైకాసహిష్ణుం దరళమణిమయద్వారకాబద్దధృష్ణున్
డినకృత్కన్యావరిష్ణున్ ద్విజపతిగతివర్ధిష్ణు గోపాలకృష్ణున్. 20

క. కనుఁగొని యాదేవునకుం
గనకంబులు మణులుఁ బూజ గావించి ప్రియం
బెనయఁ బ్రణమిల్లి నిటలం
బునఁ జేతులు మొగిచి వినయమున వినుతించెన్. 21

సీ. ఇరుజోడుమొగముల యెఱ్ఱని కొమరుండు
నేర్పునఁ బనులెల్లఁ దీర్పుచుండఁ

  1. చంపెడుగుడి
  2. నెట్టకేనియు