పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140 సింహాసన ద్వాత్రింశిక

లంబులును హంసావళులును హరిణావళులును దురగావళులును గజావళులును సింహావళులును ద్రౌపదీస్వయంవరంబులును లక్ష్మీవిలాసంబులును మదనవిలాసంబులును వసంతవిలాసంబులును రత్నకీలితంబులును రాయశృంగారంబులును గనకదంచేలును గచ్చిలంబులును గర్పూరగంథులును బారువంపుగంధులును శ్రీతోఁపులును శ్రీరామతోఁపులును శ్రీకృష్ణవిలాసంబులును జీబులును సుగిపట్టంబులును సన్నవలిపంబులును వెలిపట్టులును హొంబట్టును బులిగోరుపట్టును నుదయరాగపట్టును నేత్రపట్టును ననుపేళ్ళు గలపుట్టంబులు గట్టుకొని పాదముద్రికలును మంజీరంబులును హంసకంబులును మణిరశనాగుణంబులును ముక్తాఫలావళులును బదకంబులును నంగదంబులును నంగుళీయకంబులును గ్రైవేయకంబులును రత్నతాటంకంబులును భ్రమరకంబులును లాలాటికంబులును మౌక్తికజాలకంబులును శేఖరంబులును నాదిగాఁగల యలంకరణంబులు ధరియించి యగరు చందన హరిచందన ఘనసారోదయ భాస్కరమృగమద ప్రముఖనిఖిల వాసనల నాశావకాశంబులు వాసించుచు నృపరత్నంబుం జేరునంత. 188

క. అంగీకృతశృంగారకు
రంగీనయనాంతరంగరంజకరంగ
ద్భృంగీరవహృదయంగమ
భంగీసంగీతుఁ డగుచుఁ బవనుఁడు వీచెన్. 189

వ. అట్టి యుల్లాససమయంబున. 190

క. రూపముగల యానందము
రూపించిన మన్మథుండు రుచిరాకృతితో
దీపించెడి శృంగారము
భూపతి యని కొలిచి రెలమిఁ బొలఁతుక లెల్లన్. 191

క. ఆవేళ భూమివల్లభుఁ
డావెలఁదులు గొలువ నొప్పె యక్షవధూబృం