పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 131

వ. మఱియుం దదనురూపసఖీజనంబులును, భవసుగంధద్రవ్యహస్తంబు లగు పరిచారికాగణంబులును, విటనటపీఠమర్ధవిదూషకవైతాళికవందిబృందంబులును, భూషావిశేషభూషితదేహంబు లగు నుత్సవసందర్శనాగతోత్సుకసందోహంబులును జేరి యక్కడక్కడ నిరుపక్కియల నిలుచునప్పుడు. 140

క. ఒనరించిననీలని నడ
గని బొల్లనిఁ, గత్తలాని, గైరని, సారం
గని, జారని, జన్నని నిమ
వని మొదలుగఁ దెచ్చినిలిపె వాహకుఁ డెదురన్. 141

క. అక్కడ నొయ్యనఁ బచ్చల
పక్కెరతురగంబు నెక్కి పతి గదలుచు సొం
పెక్కెఁ దనచిలుకవారువ
మెక్కి వసంతునకు మారుఁ డెదురేగుక్రియన్. 142

శా. రాజశ్రేష్ఠుఁడు వాగె సన్నల గతు ల్రాజిల్ల రేవంతు న
ట్లాజాడం బురుకొల్పునట్టి గతితో నమ్మేరగా మెల్పఁ దా
నాజాడం బురికొంచు నట్టి వడితో నామేరఁ దానిల్చుచున్
వాజీంద్రంబు మనోజవం బనఁగ నిర్వ్యాజోద్ధతిం దేలఁగన్. 148

క. విద్యుల్లతలకు నెనయగు
హృద్యాకృతులైన వనిత లేతేర మహా
వాద్యంబులు మ్రోయఁగ నృపుఁ
డుద్యానవనాంతభూమి కొయ్యనఁ జనియెన్. 144

మ. చని యచ్చోట విభుండు చేరె సుమనోజాలప్రవాళావళీ[1]
జనితానేకసకామపంచశరచంచచ్చాపవల్లీగుణ

  1. జాలాప్తలీలావనీ