పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 సింహాసన ద్వాత్రింశతి

క. ఈ నలువుర[1] కిం దొక్కటి
యీనేల తలంపుకొలది నిట మీజగడం
బే నుడిపెద నని యొడయం
డానాలుగుమానికములు నాతని కిచ్చెన్.[2] 179

క. ఈ జాడ యీగి నీకడ
నీజన్మమునందుఁ గలుగ దిఁకఁ గలుగ దిఁకఁ బొమ్మనినన్
భోజుండు నమ్రవదనాం
భోజుండై తాను నంతిపురమున కరిగెన్. 180

శా. ప్రహ్లాదస్థిరభక్తిభాగ్యవిభవప్రత్యక్షరూపు, న్నభోం
తహ్లాదిన్యుదయాదిమూలచరణున్, దైత్యాంతకు, న్విప్రవే
షాహ్లాదాకృతికృత్యవంచితబలిం, జక్షుఃశ్రవస్తల్పు, న
ల్పహ్లాముద్రమనోనురాగవిహరల్లక్ష్మీకవక్షస్థలున్. 181

శా. ఇంద్రాదిస్తుతయోగ్యవైభవుని బర్హీభూత[3]భూతావళీ
సాంద్రానందకరప్రసంగనిజలాస్యప్రస్ఫుటీకారు, ని
స్తంద్రానేకమునీంద్రవంద్యచరణద్వంద్వున్ ముకుందప్రియుం
జంద్రాలంకరణాంకు నద్రితనయాసంసక్తచిత్తాంబుజున్. 182

మాలిని. ఉరగశయనశాయీ యోగ్యవిద్యానపాయీ
గరుడవిహితయానా క్ష్మారకోర్వీశయనా
ధరణిభరణదక్షా దండితోద్దండరక్షా
మురహరహరరూపా ముఖ్యసౌఖ్యస్వరూపా. 183

  1. ఈనలకువ
  2. క. ఏనే తలంపుకొలఁదిని
    మీనలువుర(లోని) జగడ మెడపెదననియుం
    దా నాలుగుమానికములుఁ
    బూనికతో నతనికిచ్చి పుచ్చెం బెలుచన్.
    “ఈనలకువ" యనియే చిన్నయసూరియును.
  3. బహ్వీభూత