పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100 సింహాసన ద్వాత్రింశిక

వ. అని విన్నవించి యీశోభనమునకుం గట్నంబుగా నిద్దివ్యరత్నమ్ము లిమ్ము, కోరిన నివి సైన్యసంపాదకంబును, బహుధనప్రదంబును, మృదుచిత్రవర్ణవస్త్రాభరణదాయకంబును, బక్వాన్నప్రతిపాదకంబును నౌ నని చెప్పి వీడుకొలిపిన నతం డతనివచ్చినపని సఫలం బగుటకు హర్షించి. 170

క. సుముఖుండై చనుదెంచుచుఁ
దమమాళవభూమి కొచ్చి ధరణీశ్వరు యా
గము సంపూర్తియుఁ దాన
క్రమమును విని యచటఁ దనదురాకకు వగచెన్. 171

చ. పొసఁగిన పప్పు మండెఁగలుఁ బుక్కిటిబంటిగ మెక్కి మంచి వె
క్కసపుఁ బదార్థము ల్నమలి గఱ్ఱునఁ ద్రేపఁగఁ గల్గు భూరిదా
నసమయమైన మాడ ధరణం బటు వచ్చు, విశిష్టపూజతోఁ
బసనగు పచ్చడంబు నౌకపళ్లియరంబును గల్గుఁ దప్పితిన్[1]. 172

క. చేరేడు నూకలుఁ బిడికెడు
కూరయుఁ గొని యొక్కపూఁటకూటికి దొరయై
యూరికిఁ బంచినఁ బోఁబడు
పౌరోహిత్యంబు బుద్ధి బంటఱికముగా. 178

క. అప్పటి కమికెఁడుకూటికి
నొప్పెడిదియుఁ[2] బోషణంబు, హోమము దొరకై
యొప్పించి వేల్వఁగా గతి[3]
దప్పెడు తత్త్వము పురోహితత్వము జగతిన్. 174

ఆ. అనుచు బహువిధములఁ దనపని నిందించి
కొనుచు నాత్మనగరమునకు వచ్చి

  1. పళ్లెరముం గలదప్పు దప్పితిన్ - చిన్నయసూరి
  2. సుప్పిణియును
  3. యెప్పించు కొచునులువగతి?