పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv


వెంటనే విక్రమార్కుడా విప్రునకు ఉత్తమ వధువులను సంవదలను ఇచ్చిన కథ చెప్పును.

సప్తమోపాఖ్యానము- ఏడవ బొమ్మ సముద్ర మధ్యమునందలి పర్వతమున భువనేశ్వరి ఆలయముతో తలలు తెగి పడియున్న దంపతులకై , తన తల ఈబోగా, దేవి ప్రత్యక్షమై దంపతులను బ్రతికించిన కథ చెప్పును,

అష్టమోపాఖ్యానము- ఎనిమిదవ సాలభంజిక కాశ్మీరదేశమున వర్తకుడు త్రవ్వించిన తటాకమును నింపుటకై విక్రమార్కుడు తన కంఠరక్తము నీబోగా దేవి ప్రసన్నమై తటాకమును జలపూర్ణము చేసిన కథ చెప్పును.

నవమోపాఖ్యానము- తొమ్మిదవ బొమ్మ కాంచీనగరము నందలి వేశ్యనాశ్రయించికొని ఉన్న రాక్షసుడు విటులను చంపుచున్న వార్తవిని, విక్రమార్కుడు వెళ్ళి రాక్షసుని చంపివచ్చిన కథ చెప్పును,

దశమోపాఖ్యానము. పదవసాలభంజిక సిద్ధయోగీంద్రుని ఉపదేశముచే యజ్ఞపురుషుని మెప్పించి, ఆయన ప్రసాదించిన దివ్యఫలమును విక్రమార్కుడు కుష్ఠు రోగికి సమర్పించిన కథ చెప్పును.

ఏకాదశోపాఖ్యానము. పదునొకండవ సాలభంజిక రాక్షసుని వంతునకు వచ్చిన బ్రాహ్మణ బాలకుని రక్షించుటకై విక్రమార్కుడు వెళ్ళి, రాక్షసుని మెప్పించి, అప్పటి నుండి మనుష్యభక్షణము మాన్పించిన కథ చెప్పును.

ద్వాదశోపాఖ్యానము. పండ్రెండవ సాలభంజిక విక్రమార్కుడు వేణువనములో ప్రతి రాత్రి ఒక స్త్రీని బాధించుచున్న రాక్షసునిచంపి, ఆమె వలన లభించిన సువర్ల ఘటములను, సర్వస్వము కోల్పోయిన వైశ్యున కిచ్చిన కథను చెప్పును.

త్రయోదశోపాఖ్యానము. పదమూడవ సాలభంజీక ఒక నదిలో కొట్టుకొని పోవుచున్న వృద్ధ బ్రాహ్మణ దంపతులను విక్రమార్కుడు