పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము87

సీ. బలమున నిజమునఁ బ్రాణరక్షణమున
భీము భీమాగ్రజు భీమగురునిఁ
జెలువున సంకల్పసిద్ధిఁ దేజంబునఁ
బద్మారిఁ బద్మజుఁ బద్మమిత్రు
శివభక్తి గీర్తి విశిష్టదానంబున
బాణు బాణారాతి బాణజనకు
నైశ్వర్యమున రతి నఖిలోత్సవస్పూర్తిఁ[1]
గామసంహరుఁ గాముఁ గామసఖుని
ఆ. నష్టభోగముల రణాటోపమున బుద్ధి
నింద్రు నింద్రతనయు నింద్రమంత్రి
గ్రేణి సేయు ననుచు జాణలు వొగడంగ
నవని యేలె విక్రమార్కవిభుఁడు. 109

క. సాహసము జయము బల ము
త్సాహంబుఁ బరాక్రమంబు ధైర్యముఁ గల ని
ర్మోహకుని దొరయునెడ సం
దేహించుచునుండు నాదిదేవుం డైనన్. 110

క. నరుఁడు మగతనము నేర్పునఁ
బరఁగించెడుచోటఁ దోడుపడుదురు సురలున్
ధర గౌళికునకుఁ దోడ్పడ
గరుడఁడు జక్రంబు హరియుఁ గలిగినభంగిన్. 110

గౌళికుని కథ

క. అనవుడు భోజుఁడు గౌళికుఁ
డనువానికి నెచట విష్ణుఁ డాయుధఘును వా

  1. నఖిలలోకస్ఫూర్తి