పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 సింహాసన ద్వాత్రింశిక

పట్టిన మ్రొక్కి మహీవరుఁ
డిట్టనియెం దల్లి మెచ్చి తెట్టులు నన్నున్. 92

మ. ఇతఁడు న్మౌనము సంధ్యయున్ జపము ని ట్లేకాలముం జేయఁగా
శతవర్షంబులు పోయె నీద్విజుని మెచ్చం జెల్లదో మెచ్చుసం
గతి గాదో గుణ మానతి మ్మనిన నోక్ష్మాపాల యీదుస్తర
వ్రతము ల్గల్గియుఁ జంచలంబు మతి భావం బల్ప మెప్పట్టునన్. 93

ఆ. మేరుశైలధీర పేరులంఘితమున
నాఁగు నీవ్రతంబు నగణితంబు[1]
చంచలాత్మకృతము సంకల్పరహితంబు
నైన జపము లెల్ల హానిఁ బొందు. 94

క. దేవర భువిఁ గాష్ఠంబున
గ్రావంబునఁ గాంచనమునఁ గలుగఁడు శుచియౌ
భావమునఁ గలుగ నేర్చును
భావజ్ఞా! భావశుద్ధి పరమార్థ మనన్[2]. 95

క. డెందంబున సందేహము
నొందక ప్రహ్లాదుతండ్రి నొడఁబఱిచెడుచో
నిందుఁ గలఁ డనినఁ గంబము
నం దుదయింపండె విష్ణుఁ డసురులు బెదరన్. 96

క. దేవద్విజమంత్రౌషధ
దైవజ్ఞాచార్యతీర్థధర్మముల యెడన్
భావన యేవిధమున నౌ
నా వెరవున నచటి సిద్ధి యగునిద్దగతిన్[3]. 97

  1. మేరుసమానమౌ ఘనతపంబులౌ నగణితమైన
  2. పరతత్త్వ మనన్
  3. నీదుక్రియన్