పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80 సింహాసన ద్వాత్రింశిక



నందుల మ్రాకులు నందనవనకల్ప
తరువులతోఁ గూడి పెరుఁగుచుండు
నందుల క్రొవ్విరు లన్నదమ్ముల మాడ్కిఁ
జుక్కలవాసన కిక్కసేయు
నందుల సెలయేఱు లాకాశగంగతో
నటనలు సలుపుచు నాడుచుండు
ఆ. నందుల మెలఁగు కరు లైరావతముఁ దాము
గదుపుగట్టిమేసి మదము గురియు
నందుఁ గలుగు మౌను లాసప్తమునులతో
నిత్యసత్యగోష్ఠి నిలుతు రచట. 73

ఉ. అందుల నొక్కచో జలకమాడుచునుండఁగఁ దొల్లి మేదినీ
నందనవక్త్రవేణినయనస్తనకాంతులు జాతిరూపులై
యిం దుదయించె నాఁగ నుతి కెక్కుచుఁ బెక్కుదినంబు లంబుజేం[1]
దిందిర మీనచక్రములు దేలుచునుండు సరోవరంబులన్. 74

క. వివిధద్వాదశరాసులు
దవిలి తిరిగి పాళ్లసంపదలు చేకుఱమి
న్నవరత్నరాసులకునై
నవగ్రహంబులుం దదంగణంబులఁ బొలయున్. 75

క. వింతలుగా నగ్గిరిపొడ
వింతం తనిచెప్ప నలవి యే వెన్నెలఁ ద
తాంతంబునఁ గరఁగిన శశి
కాంతంబులు చంద్రుకందు గడుగుచునుండున్. 76

  1. నుతికెక్కుదినంబులయందు నంబుజేం