పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 75

తే. అనినఁ గ్రమ్మఱఁ జదివించి యల్లనవ్వి
ధరణిలో నీవు “చతురంగ తద్జ్ఞ" సంజ్ఞ
బరఁగినాఁడవ యనుఁడు భూపాలుఁ బొగడి
యెలమిఁ జతురంగతద్జ్ఞ కవీశ్వరుండు. 48

క. ఇది తగుఁదగ దనక కళా
విదులకు నీసమ్ముఖమున విద్యలయెఱుకం
బొద పెట్టుట హనుమంతుని
యెదుర వెసం గుప్పిగంతు లెగయుటచుమ్మీ[1]. 49

ఉ. అంబుజమిత్రతేజ భవదగ్రకరప్రసృతంబు లైన దా
నాంబువులందుఁ బుట్టె భువనాంతము నిండుచుఁ గీర్తిపుండరీ
కంబు ప్రతాపసూర్యుఁడు వికాస మొనర్పఁగ నాకసంబు భృం
గంబుగ లోనఁ బూని యధికం బగువాసన నొప్పు నెప్పుడున్. 50

క. అని చెప్పిన పద్యములోఁ
దనకీర్తివ్యాప్తియుం[2] బ్రతాపస్ఫురణం
బును గని భాండాగారికుఁ
గనుసన్నం బిలిచి మెచ్చుగా నాతనికిన్. 51

క. ధనమిప్పించె విలోకన
మునకుం బలుకునకు హసితమునకుఁ గవికి వే
యును బదివేలును లక్షం
బును గోటియుఁ బసిఁడిటంకములు చొప్పులుగాన్. 52

క. ఘనుఁడు కవి వీడుకొని యొ
య్యన భాండాగారిఁ బిలిచి యర్థి ననుం జూ

  1. గుప్పిగంతులేయుట చుమ్మీ
  2. దనకీర్తియు వ్యాప్తియు