పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 సింహాసన ద్వాత్రింశిక

గ్రతువులు నూఱును జేయక
నితరుల కమరేంద్రపీఠ మెక్కం దరమే[1]. 11

క. అనవుడు భోజుఁడు విస్మయ
మును సిగ్గు నహంకృతియును ముప్పిరిగొన ని
ట్లనియె నొక యర్థి వేఁడినఁ
దనియఁగ సహపాదలక్షధన మే నిత్తున్. 12

క. నావితరణ మిది యల్పమె
నావుడు నది నవ్వి తనగుణం బన్యులకుం
దా వినిపించుట కొఱఁత గ
దా వివరము తప్పి తీవు ధరణీనాథా! 13

క. ఇది మొదలు కొఱఁత యయ్యెం
దుదిఁ బుణ్యము హానిఁబొందె దొడ్డతనంబుం
జెదరెం దనుఁదాఁ బేర్కొను
టిది కష్టము తొంటినీతి యెఱుఁగవు చుమ్మీ. 14

ఉ. ఆయువు మంత్ర మౌషధము నర్థము దానము మానభంగ మ
న్యాయము నర్థనాశము గృహవ్యసనంబును దాఁపురంబుగాఁ
జేయుట నీతియుక్త మటు సేయక తా నయి దానధర్మముల్
చేయుదునంచుఁ జెప్పినను సీయని నవ్వరె ధర్మ మెంచరే. 15

సుదర్శనుని కథ

క. ఈ సమయమునకుఁ దగ నితి
హాసము గలదొకటి వినుము హరిదశ్వకులో

  1. మెక్కుట గలదే