పుట:సత్యశోధన.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకధ

61

పూర్తి వివరాలు తెలుపుతూ ఆమెకు ఒక జాబు వ్రాశాను. జ్ఞాపకం వున్నంతవరకు నేను రాసిన జాబు సారాంశం క్రింద తెలుపుతున్నాను.

“బ్రైటన్‌లో కలిసినప్పటి నుండి మీరు నన్ను ప్రేమగా చూస్తున్నారు. తల్లి తన బిడ్డను చూచే విధంగా మీరు నన్ను చూస్తున్నారు. నాకు పెళ్ళి అవడం మంచిదనే భావంతోనే యువతుల్ని నాకు పరిచయం చేస్తున్నారు. ఈ వ్యవహారం ముదరక ముందే మీ ఈ ప్రేమకు నేను తగనని తెలియజేయడం నా కర్తవ్యమని భావిస్తున్నాను. నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయిందని నేను మీతో పరిచయం అయినప్పుడే చెప్పి వుండవలసింది. హిందూ దేశంలో పెండ్లి అయి ఇక్కడ చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు తమకు పెళ్ళి అయిందని చెప్పరనే విషయం నాకు తెలుసు. నేను కూడా ఆ విధానాన్ని పాటించాను. అయితే ఇప్పుడు ఆ విషయం చెప్పి వుండవలసిందని నాకు బోధపడింది. బాల్యంలోనే నాకు వివాహం అయిపోయిందనీ, నాకు ఒక కొడుకు కూడా కలిగాడని ముందుగానే చెప్పియుంటే బాగుండేది. మీకు చెప్పకుండా దాచి ఉంచినందుకు నేను విచారిస్తున్నాను. అయితే ఇప్పటికైనా మీకు నిజం తెలియజేయాలనే ధైర్యం భగవంతుడు నాకు ప్రసాదించాడు. అందుకు సంతోషిస్తున్నాను. మీరు నన్ను క్షమించండి. మీరు నాకు పరిచయం చేసిన యువతితో ఏ విధమైన అక్రమసంబంధం నేను పెట్టుకోలేదని మీకు తెలుపుతున్నాను. మీరు నా యీ మాటను నమ్మవచ్చు. హద్దు దాటగూడదను విషయం నాకు తెలుసు నాకు మూడుముళ్ళు పడాలనే భావం మీకు కలదని నాకు తెలుసు. ఈ భావం ఇంకా మీ మనస్సులో వ్రేళ్ళూనగూడదనే భావంతో నిజాన్ని ఈ జాబు ద్వారా తెలియజేస్తున్నాను.

ఈ జాబు అందిన తరువాత నేను మీ దగ్గరకు రా తగనివాడినని మీరు భావిస్తే నేను బాధపడను. మీరు చూపిన స్నేహానికి సదా కృతజ్ఞుణ్ణి. మీరు నన్ను వదలి వేయకుంటే చాలా సంతోషిస్తాను. ఇంత జరిగినా మీరు నన్ను మీ దగ్గరకు రానిస్తే, అందుకు నేను తగుదునని మీరు భావిస్తే నాకు క్రొత్త స్పూర్తి లభిస్తుంది. మీ ప్రేమకు పాత్రుడనయ్యేందుకు సదా ప్రయత్నిస్తూ వుంటాను.

ఇంత పెద్ద జాబు త్వరగా వ్రాశానని పాఠకులు గ్రహించకుందురుగాక. ఎన్ని చిత్తులు వ్రాశానో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ జాబు ఆమెకు పంపి పుట్టెడు బరువు తీరిపోయినట్లు భావించాను. ఈ చర్య నాకు హాయి కలిగించింది. మరు టపాలో ఆ వృద్ధ మహిళ వ్రాసిన జాబు అందింది. అందులో ఈ విధంగా వుంది. “నీవు నిర్మల హృదయంతో రాసిన జాబు అందింది. మా ఇద్దరికీ సంతోషం కలిగింది. ఇద్దరం