పుట:సత్యశోధన.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

31

 అతనికి తెలియజేశాను. అతడు నా సందేహనివృత్తి చేయలేకపోయాడు. “పెద్దవాడవైన తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు. చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు.” అని అతడు అన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి, అందు ఖాద్యాఖాద్య ప్రకరణం, తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు వ్రాసివున్నాయి. యీ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడవైన తరువాత చదివి తెలుసుకుంటానమి మనస్సుకు నచ్చచెప్పకున్నాను.

మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసా బోధ కలుగలేదు, మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది. పాములు, నల్లులు మొదలుగా గల వాటిని చంపడం నీతి బాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని నేను చంపాను. ఆ విషయం యిప్పటకీ నాకు జ్ఞాపకం వున్నది.

ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతిమీద నిలబడి వున్నది. నీతి అనేది సత్యంతో కూడివుంది కనుక సత్యాన్వేషణ జరిపితీరాలి అను భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది, సత్యాన్ని గురించిన వాఖ్య నా దృష్టిలో విస్తరించింది. యిప్పటికీ విస్తరిస్తూ ఉంది.

నీతికి సంబంధించిన ఒక ఛప్పయ్ ఛందం హృదయంలో చోటు చేసుకున్నది. ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమా! అను సూత్రం నా జీవితానికి మూలమైంది. ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది. అపకారికి మేలుకోరడం, మేలు చేయడం అంటే అనురాగం పెరిగింది. ఈ విషయమై ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. ఆ మహత్తరమైన ఛప్పయ్ ఛందస్సు క్రింద ఉటంకిస్తున్నాను.

పాణీ ఆపనే పాయ్, భలుం భోజన్ తో దీజే
ఆనీ నమానే శీశ్, దండవత్ కోడే కీజే
ఆపణ ఘూసే దామ్, కామ్ మహోరో నుం కరిఏ
గుణ కేడేతో గుణ దశగణో, మన వాచా కర్మేకరీ
అవగుణ కేడేజే గుణకరే, తేజగమాంజీత్యో సహీ.

“జలమును మీకీయగలవాని కెందేని నొసగుమీ కడుపార నోగిరంబు
వందనంబును జేయువానికిజేయుమీ భుక్తిమై సాష్టాంగవందనంబు