పుట:సత్యశోధన.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

384

ఉపవాసం

జరుగుతున్నది. ఆశ్రమంలో నేతపని ముఖ్యం. వడుకుపని గురించి యింకా మేము ఆలోచించలేదు. అందువల్ల నేతకోసం గృహం నిర్మించాలని నిర్ణయించాం. దానికి పునాది వేశాం. 

22. ఉపవాసం

కార్మికులు మొదటి రెండువారాలు ధైర్యంగాను శాంతంగాను వున్నారు. రోజూ జరిగే సభకు వస్తూ వున్నారు. నేను రోజూ వారికి వారు చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేస్తూ వున్నాను. మేము ప్రాణమైనా వదులుతాం, ప్రతిజ్ఞను మాత్రం నెరవేరుస్తాం అని బిగ్గరగా అరుస్తూ వున్నారు. కాని చివరికి వారు జారిపోతున్నారని అనిపించింది. మిల్లులోకి వెళుతున్న కార్మికులను చూచి వాళ్లు హింసకు దిగారు. ఎవరిమీదనైనా చెయ్యి చేసుకుంటారేమోనని భయం కలిగింది. రోజూ సభకు వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కొద్దిమంది వచ్చినా నిరుత్సాహంతో వుండేవారు. కార్మికుల్లో స్థిరత్వం తగ్గిందని తెలిసి విచారించాను. దక్షిణాఫ్రికాలో కార్మికుల సమ్మెకు సంబంధించిన అనుభవం నాకున్నది. కాని యిక్కడ క్రొత్త అనుభవం కలిగింది. రోజూ ప్రతిజ్ఞ చేయిస్తూ సాక్షిగా వున్న నా ఎదుటే యిలా జరిగితే నేనేం చేయాలా అని ఆలోచించాను. యిది నాకు కలిగిన అభిమానం అనుకున్నా సరే, కార్మికుల యెడ, సత్యం యెడ నాకు గల ప్రేమ అనుకున్నా సరే తీవ్రంగా యోచించాను.

ఉదయం సభ ప్రారంభమైంది. ఏం చేయాలో తోచలేదు. స్థిరంగా ధైర్యంగా వుండక పోతే సమస్య పరిష్కారం కాకపోతే అంతవరకు నేను ఉపవాసం చేస్తాను అని ప్రకటించివేశాను. కార్మికులు నివ్వెరపోయారు. అనసూయాబెన్ కండ్లనుండి నీరు కారింది. మీరు ఉపవాసం చేయొద్దు. మేము చేస్తాం. ప్రతిజ్ఞ మీద నిలబడివుంటాం క్షమించండి అని కార్మికులు అన్నారు. మీరు ఉపవాసం చేయనవసరంలేదు. మీరు మీ ప్రతిజ్ఞ నెరవేర్చండి చాలు. మా దగ్గర డబ్బులేదు. అయినా కార్మికులకు బిచ్చం తినిపించి సమ్మె చేయించడం నాకు యిష్టంలేదు. మీరు కాయకష్టం చేసి పొట్టపోసుకోండి. ఎన్నాళ్లు సాగినా సరే నిశ్చింతగా సమ్మె చేయండి. నిర్ణయం జరగనంతవరకు నా ఉపవాసం సాగుతుంది అని చెప్పివేశాను. వల్లభభాయి కార్మికులకు మునిసిపాలిటీలో పని యిప్పించాలని ప్రయత్నించారు. కాని ప్రయోజనం కలుగలేదు. ఆశ్రమంలో నేత గృహం దగ్గర గల గొయ్యిని పూడ్చాలి. కార్మికులను అందుకు వినియోగించవచ్చునని మగన్‌లాలు సలహాయిచ్చారు. అందుకు కార్మికులు అంగీకరించారు. అనసూయాబెన్