పుట:సత్యశోధన.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

ఒక పావన స్మృతి - ప్రాయశ్చిత్తం

మిత్రుడొకడు నా దగ్గరకు వచ్చి మాట్లాడగా వారికి ఉద్యోగం ఇప్పించేందుకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను. వాళ్ళకు ఉద్యోగం దొరికింది కూడా. అప్పటినుండి ఇంగ్లీషు వాళ్ళకు కూడా నా మీద విశ్వాసం ఏర్పడి నేనంటే భయపడటం మానివేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలం వాడవలసి వచ్చేది. అయినా వాళ్ళంతా నాతో మధుర సంబంధం కలిగి ఉండేవారు. అట్టి స్వభావం, అట్టి ఆచరణ నాకు బాగా అలవాటు అయ్యాయి. అయితే అప్పటికి ఈ విషయం నేను గ్రహించలేదు. తరువాత అర్థం చేసుకున్నాను.

10. ఒక పావన స్మృతి - ప్రాయశ్చిత్తం

నా జీవితంలో ఎన్నో ఘట్టాలు జరిగాయి. వాటివల్ల అనేక మతాల వారితోను, జాతుల వారితోను నాకు గాఢ పరిచయం ఏర్పడింది. వీటన్నిటివల్ల కలిగిన అనుభవాల వల్ల స్వ-పరభేదాలు, దేశీయులు, విదేశీయులు, తెల్లవారు-నల్లవారు, హిందువులు - ముస్లిములు, క్రైస్తవులు పారశీకులు, యూదులు మొదలుగా గల వారి మధ్య వుండే భేదాలను అధిగమించగలిగాను. నా హృదయం అట్టి భేదాలను గుర్తించలేదని చెప్పగలను. నా విషయంలో ఇది గొప్ప సుగుణమేమీ కాదని నేను భావిస్తున్నాను. అహింస, బ్రహ్మచర్యం, అపరిగ్రహం మొదలుగాగల గుణాలను అలవరచుకొని, వాటి ఆధారంతో ఇప్పటివరకు నడుస్తున్నట్లే మతాల, జాతుల, రంగుల భేదాన్ని అలవరచుకోవడం కూడా సహజంగానే జరిగిందని నా భావన. డర్బనులో వకీలుగా పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పనిచేసే గుమాస్తాలు నాతోబాటే వుండేవారు. వారిలో హిందువులు, క్రైస్తవులు వున్నారు. ప్రాంతాలవారీగా గుజరాతీలు, మద్రాసీలు వున్నారు. వారి విషయంలో నా మనస్సులో ఎన్నడూ వేరు భావం కలిగినట్లు గుర్తులేదు. వాళ్ళందరినీ నా కుటుంబీకులుగానే భావించేవాణ్ణి. నా భార్య ఎప్పుడైనా ఈ విషయం ఎత్తితే ఆమెతో తగాదాకు దిగేవాణ్ణి. ఒక గుమాస్తా క్రైస్తవుడు. అతని తల్లిదండ్రులు పంచమకులంవారు. నా గృహవ్యవస్థ పాశ్చాత్య విధానంతో కూడినది. అతని గదిలో పాయిఖానా లేదు. నా అభిప్రాయం ప్రకారం వుండకూడదు. అందువల్ల పాయిఖానాకు బదులు ప్రతిగదిలోను మూత్రం పోసుకునేందుకు ప్రత్యేక పాత్రలు వుంచాము. ఆ పాత్రలను తీసి బాగుచేసే కార్యక్రమం నౌకర్లది కాదు. ఇంటి యజమానిది, యజమానురాలిది. తాను కూడా మా కుటుంబంలో ఒకడినని భావించుకున్నవాడు తన పాత్రలు తానే కడిగి బాగుచేసుకునేవాడు. పంచమకులానికి చెందిన ఈ గుమాస్తా