పుట:సత్యశోధన.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

కాశీలో

బ్రహ్మదేశాన్నుండి తిరిగి వచ్చిన తరువాత గోఖ్లేగారి దగ్గర సెలవు తీసుకున్నాను. వారిని విడిచి పెట్టడం ఎంతో కష్టమనిపించింది. అయితే నాకు బెంగాలులో లేక కలకత్తాతో పని అయిపోయింది. అన్ని పనుల కంటే ముందు హిందూ దేశంలో మూడో తరగతి రైలుబండ్లలో ప్రయాణం చేసి ఆ తరగతిలో ప్రయాణించేవారి కష్టాలు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఈ విషయం గోఖ్లేగారికి విన్నవించాను. వారు వెంటనే నవ్వారు కాని నా అభిప్రాయాలు తెలుసుకొని సంతోషించారు. ముందు కాశీకి వెళ్ళి అనిబిసెంట్ గారి దర్శనం చేసుకొందామని నిర్ణయించుకున్నాను. అప్పుడు ఆమె జబ్బుపడి మంచం పట్టి వున్నది.

మూడోతరగతి రైలుబండి ప్రయాణానికి తగిన సరంజామా సిద్ధం చేసుకోవలసి వచ్చింది. లడ్లు, పూరీలు నింపిన టిఫిన్‌బాక్సు ఒకటి గోఖ్లేగారు బహూకరించారు. పన్నెండు అణాలు పెట్టి ఒక సంచి కొన్నాను. ఒక రకమైన చాయగల ఉన్నికోటు (పోరుబందరు ప్రాంతంవారు ధరిస్తారు), ఒక తువాలు, ఒక ధోవతి, ఒక చొక్కా దాన్లో వుంచాను. కప్పుకునేందుకు ఒక కంబళీ తీసుకున్నాను. ఒక లోటా కూడా తీసుకుని ప్రయాణమైనాను.

గోఖ్లేగారు, రాయ్‌గారు నన్ను సాగనంపడానికి రైలు స్టేషనుకు వచ్చారు. రావద్దని బ్రతిమిలాడాను. కాని వారు నా మాట వినలేదు. “నీవు ఒకటో తరగతిలో ప్రయాణిస్తూవుంటే నేను రాను. కాని ఇప్పుడు రాక తప్పదు” అని గోఖ్లేగారు అన్నారు.

ప్లాటుఫారం మీదకు వస్తూ వున్నప్పుడు గోఖ్లేగారిని ఎవ్వరూ ఆపలేదు. వారు పట్టు పాగా చుట్టుకున్నారు. కోటు తొడుక్కున్నారు. డాక్టర్‌రాయ్ గారు బెంగాలీ దుస్తుల్లో వున్నారు. ఆ కారణంవల్ల టిక్కెట్టు కలెక్టరు వారిని మొదట ఆపి వేశాడు. కాని గోఖ్లేగారు “నా మిత్రులు” అని చెప్పిన మీదట రానిచ్చారు. ఈ విధంగా వారిద్దరు వచ్చి నన్ను సాగనంపారు. 

20. కాశీలో

కలకత్తా నుండి రాజకోట వెళ్ళే దోవలో గల కాశీ, ఆగ్రా, జయపూర్, పాలన్పూర్ చూచుకుంటు రాజకోట చేరుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రతిచోట ఒక్కొక్క రోజు వున్నాను. పాలన్‌పూరులో తప్ప మిగతా అన్ని చోట్ల సత్రాల్లోను పండాల ఇళ్ళల్లోను వున్నాను. ఈ ప్రయాణానికంతకు రైలు చార్జీతో సహా మొత్తం ముప్పది ఒక్క రూపాయలు మాత్రం ఖర్చు అయిందని గుర్తు. మూడవ తరగతిలో ప్రయాణం