పుట:సత్యశోధన.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

ఒరిపిడి

భారతీయుడుగా కనబడేందుకు ముఖాన రంగుపులుముకున్నాడని చెప్పవచ్చు. మరొకడు ఏం వేషం వేశాడో నాకు గుర్తులేదు. ప్రక్క సందుగుండా వెళ్లి ఒక దుకాణం చేరుకున్నాం. ఆ దుకాణం గిడ్డంగిలో గల బస్తాల మధ్యగా దారి చేసుకొని వెళ్లి దుకాణం ద్వారం దాటి గుంపుకు దొరక్కుండా బయట పడ్డాం. వీధి చివర నాకోసం బండి సిద్ధంగా వున్నది. ఆ బండి ఎక్కి పోలీసు ఠాణా చేరుకున్నాము. నేను సూపరింటెండెంటుగారికి, పోలీసు గూఢచారులికి ధన్యవాదాలు అర్పించాను.

ఒక వంక నేను గుంపును తప్పించుకు పోతూవుంటే మరోవంక సూపరిండెంట్ అలెగ్జాండరుగారు. “పదండి ముందుకు పట్టుకువద్దాం చెట్టు కొమ్మకు వేలాడతీద్దాం” అని పాట పాడుతూ జనాన్ని ఆపుతూ వున్నాడు. నేను పోలీసు స్టేషనుకు సురక్షితంగా చేరానను వార్త అందగానే అలెగ్జాండర్ స్వరం మార్చి “ఏమండోయ్! లేడి పారిపోయింది యిక పదండి మీమీ ఇండ్లకు” అని జనాన్ని నిరుత్సాహపరచడం ప్రారంభించాడు. దానితో కొందరికి కోపం వచ్చింది. కొందరికి నవ్వు వచ్చింది. చాలామంది ఆయన మాటల్ని నమ్మలేదు. “అయితే మీలో కొందరు లోపలికి వెళ్ళి చూచి రండి. గాంధీ వుంటే మీకు అప్పగిస్తాను. లేకపోతే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరెవ్వరు రుస్తుంజీ గృహానికి నష్టం కలిగించరని, గాంధీ భార్యా బిడ్డల జోలికి పోరని నాకు తెలుసు” అని అన్నాడు.

జనంలో నుండి యిద్దరు ముగ్గురు లోపలికి వెళ్ళి చూచి బయటకి వచ్చి గాంధీ లేడని జనానికి చెప్పారు. కొందరు అలెగ్జాండరును భూషించారు. కొందరు దూషించారు. ఇక చేసేదేమీ లేక అంతా ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. కీ.శే. చేంబర్లేను గారు గాంధీని కొట్టిన వాళ్ళను శిక్షించమని నేటాలు ప్రభుత్వానికి తంతి పంపారు. ఎస్కాంబీగారు నన్ను పిలిపించారు. నాకు తగిలిన దెబ్బలకు విచారం ప్రకటించారు. మీ వెంట్రుకకు హాని కలిగినా నేను సహించను. లాటనుగారు చెప్పిన ప్రకారం నడుచుకోక, నేను చెప్పిన ప్రకారం నడుచుకొనియుంటే అసలు ఈ దుఃఖకరమైన ఘట్టం జరిగేదేకాదు. ఘాతకుల్ని మీరు గుర్తించితే వాళ్ళను నిర్భందించి శిక్షిస్తాం. చేంబర్లేనుగారు కూడా అలాంటి తంతి పంపించాడు అని అన్నారు.

“ఎవ్వరిమీద కేసు పెట్టడం నాకు యిష్టం లేదు. ఆ జనంలో ఇద్దరు ముగ్గురిని గుర్తు పట్టగలను. కాని వారిని శిక్షిస్తే నాకేమి లాభం? వారిని దోషులని నేను అనను. హిందూ దేశంలో నేను తెల్లవారిని నోటికి వచ్చినట్లు నిందించానని, లేనిపోని మాటలు చెప్పి ఎవరో వారిని రెచ్చకొట్టారు. అట్టి వారి మాటలు నమ్మి వారు