పుట:సత్ప్రవర్తనము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

63


వారి వెంట బోవ నంగీకరించెను, ఆ యంగీకారము తల్లి దండ్రుల చెంతయో సంతోష మొసంగ జాలెను.

భగీరద దాసు దర్శింప బోయిన వారొకరు, వచ్చి రామ చంద్రరాజుతో సుపుత్రుడునగు నిన్ను దాసుగారు చూడగోరుచున్న వారని తెలిపెకు. ఏనుగు నెక్కిసంత సంతోపము కలుగగా, గొడుకునార్త నెరింగించెను. పాఠశాలలో నాదిననములు సెలవు దినములుగా డైవికముగా నేర్పడుట నిదియృ సుసమయముని యతడు తెలిపెను. భార్యయుఁ బయనమయ్యెను. అదినమే సాయంకాలము నకు వాడు మూవు రాయాశ్రమముకుచేరి, ఛాయావృక్షముల కిందనే యుండవలయును గాని నిలువ వేరొక తావు లేదు. అవృక్ష ములు "వేలకొలది మానవులకు జోటీయ జాలినవి. కాన నందుండిరి. ఆరాత్రి, దాసును దర్శించి, చీఱు నవ్వుతో సుసచయమునకే వచ్చితి రనెను, తమ సెలవుననే వేచియుంటిని, ఆ భాగ్యము లభించెను. కృతార్థుడనైతినని రాజు పలికెను , రేపు తెలియఁగలదని దాసు బదులుకులికి తనపనికైన పోయెను.

మఱుదిన ముదయమున రాజు కాలకృత్యములఁ దీర్చి కొఇని వంటకుఁదగిన వస్తు వ్రాతము తెచ్చియుండుట వాని భార్య కిచ్చుచుండగా మధుసూదన రాజు సకుటుంబముగా వచ్చెను. పరస్పర కుశల ప్రశ్నములు సాగెను. "వారు నొక వృక్షము క్రింద నుండిరి. మధ్యాహ్నము కాగానే భుజింపక "దాసు దర్శనమునకై వేచియుండిరి. యుక్త సమయమున దాసు లేచి మాటలాడఁదగు చోటఁ గూరుచుండెను, ఎల్లరు నచ్చటికింబోయి యథార్హముగా దర్శించిరి. వారిని గూరు చుండ నియోగించి "వీరి కుపదేశింపఁ బూనితిని. ఈయిరువురు