పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

151


    నీపాదపాంసుల నిరతమౌఁదలఁదాల్చు
              నేను నీయున్నతి నెగ్గఁజేతు
    సంధి సంగరములే శరణమై కనుపించు
              సంధిఁ ద్రోసినను నిశ్చయము రణము
    ప్రస్తుతస్థితుల నక్బరు వీడి నినుజేరి
              దుర మొనర్చుట నాకు దుర్లభమగు
              
గీ॥ నతఁడు విడఁడీవు లోఁబడ వంతమేది
    మకర గజరాజముల పోరు మాడ్కి సాగుఁ
    బుష్పవన మట్టిభారత భూమియెల్ల
    నగ్గి పెట్టితిరంచు దుర్యశము గలుగు. 284
 
    
ఉ॥ భూరమణేంద్రు లందఱును బోయిన మార్గమె యోగ్య మింతకున్
    వేఱగు త్రోవలేదు; పృథివిన్ గల సర్వము వెంటఁగొంచు నీ
    యేఱిటు పాఱఁజొచ్చె: నెదురీద నెవండు సమర్ధుఁడౌ; వృధా
    పౌరుష మున్నదంచు బడబాజ్వలనంబును బాఱమ్రింగెదే" 285
 
    
క॥ అన ముసిముసి నగవులు మో
   మునకుం జెంగావిరంగు మొనయింపఁ బ్రతా
   పనృపతి యంబర్పతీ యా
   ననము దెసనుగాంచి "ముగిసెనా! నీమాటల్. 286
286
   
సీ॥ కోమటి యొకచిల్కఁ గొని కొన్ని యేండ్లకుఁ
             బంజరంబును గొంచు వనికిఁబోయె
    నడవిచిలుక "చుట్ట మా!బందె గొనీరె! స్వా
             తంత్య్రమ్ముచెడె నెట్లో తప్పుకొనుచు
    నేగుదెమ్మనె! స్వేచ్ఛ యెఱుఁగని తొలిచిల్క
            "గాలిలో నెట్టులు తేలుచుంటి
    క్రిందఁబడవెః యేమితిందు వీయడవి! నె
             వ్వరు సాకెదరు శత్రుభయము లేదె
             
గీ॥ పంజరమునఁ జోటిత్తు నా సజ్జనుండు
   కోమటియుఁ దియ్యమామిడి గుజ్జు పెట్టు