పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

147

    యాబాజబహదూర్మ యానాపతుల గెల్చి
              పరిభూతి యెఱుఁగని బలిమికత్తె
    పల్లెలపైఁ బులి పడెనన్నఁ జనిచంపు
              దాఁక నుపవసించు ధర్మమూర్తి
    వివిధ వర్ణాశ్రమ విధులు తూచాతప్ప
              కయే ప్రతిష్ఠించిన గౌరవాఢ్య
              
గీ॥ యట్టి క్షాత్రతపస్విని నరులు దాఁక
   బ్రాణముల చియ్యలేక భారత మహీశు
   లంగనలకన్న దుర్బలు లై రటంచు
   దేశ దేశముల్ తిట్టు దుస్స్ధితులు దెచ్చె. 270
   
సీ॥ సిరి పుట్టినిల్లు ఘూర్జరదేశమును దవా
             నల మొకోయనక్షామ మలముకొనియె;
   మ్రింగ మెదుకులేక మేదినీప్రజ తిన
             రాని జంతుల శరీరములు దినియు
   నాకలి చల్లార కట్టెకుప్పలు కుప్ప
              లైకూలెఁ దక్కువా రాశవముల
   గాకులు గ్రద్దల కరణిఁబైబడి పీకి
              తినఁజొచ్చి; రక్చరు దిగ్విజయము
              
గీ॥ చల్లఁగా సాగ వంగదేశమున నుండెఁ
   గానిత్రుటియైనఁ జింతించు కరిణిలేదు
   జగము సర్వంబు గెలిచిన సౌఖ్యమేమి
   ప్రజకెడరు లేక పాలింప వలయుఁగాదె? 271
   
మ॥ పదిపడ్రెండు వసంతముల్ గడచి పోవన్ లేదె సన్న్యాసులన్
    గదనంబున్ బురికొల్పి యందునొక పక్షంబూని తానందఱన్
    దుదముట్టించి ధనేశ్వరంబునను గన్నుల్ చల్లఁగాఁ జూచుచున్
    మదిమోదింపఁడె; దొడ్డవారి కుచితంబా యిట్టిహింసారతుల్ 272 272
    
మ॥ ఘనదుర్గంబులు వాహినీతతులు భాగ్యశ్రేణులన్ బట్టియె
    ప్డును దేశోన్నతినెన్నరాదు; గుణసంపూర్ణత్వమున్ నిగ్రహం