పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

145


    గాని కామోప భోగముల నైశ్వర్య సం
              పాదనకేయది పనికివచ్చు
    ధర్మం బఖిలలోక తత్వంబులకు నెల్లఁ
              దల్లియుఁ దండ్రియు దైవమగును
    నీతియో గౌరవ స్వాతంత్య్రముల కడ్డు
              పడనంతవరకె సంభావనీయ
              
గీ॥ మాత్మ గౌరవహాని దాపైనయపుడు
   మానధనులకుఁ ద్యాగ సంపదయుఁ బౌరు
   షమును సాహసమునుగాక శరణ యోగ్య
   మగుపదం బొక్కఁడుండ దీయవనియందు 264
   
సీ॥ పలువురు నీవంటివారు ఢిల్లీశ్వరుం
             డగణిత గుణశాలి యనఁ గవిందు
    నతఁడు ఘనుండు కాఁదనను నేఁగూడ; న
             క్బరుదెసఁ గడు గౌరవం బెసంగు
    నతఁడమానుష సద్గుణాఢ్యుండనను। గాని
             యవనభూపతుల యోగ్యతముఁ డందుఁ;
    గొన్ని మంచిగుణంబు లున్నవి నిజము, శా
             త్రవుఁడైన గుణమున్న దాపరాదు
             
గీ॥ పరులవృత్తి విమర్శించి పారఁబట్టి
   లేనిపోని దుశ్శంకలు లేవనెత్తి
   నలుపులు గణించి లేని నిందలు ఘటించు
   టభిమతముగాదు నాకు బాల్యంబునుండి 265 265
   
సీ॥ జగమునందిప్డున్న సమాట్టులందెల్ల
             నక్బరు పెద్దవాఁడగుట నిజము
    నీవనినట్లు సేనావారములు లక్ష
             లుంగోటు లతని కుండంగవచ్చుఁ
    బట్టిన దంతయు బంగారుగావచ్చు
             గోపాలదేవునిఁ గొలువవచ్చు