పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

143

    నామూర్తులకన్న నాదిదేవునికన్నఁ
             బూతంబులంచుఁ గోవులకు మ్రొక్కు
             
గీ॥ నార్షవిధి సూర్యభగవాను నర్చ చేయుఁ
   దెల్లగడ్డయు మాంసంబుఁదినఁ గరోయు
   నింకఁ బెక్కేల నీకాల మీగుణమ్ము
   లు త్తమ బ్రాహ్మణులకై ననున్నే చెపుమ. 255
   
గీ॥ స్వామి యాతఁడు సద్గురుస్వామి వీవు
   నిహ మతఁ డొసంగుఁ బరసౌఖ్య మీవొసంగె
   దిరువురును రెండు కనులు నా కేకరీతిఁ
   గొలుతు నిరువుర పాదముల్ తల ధరించి. 256
   
మ॥ భవదత్యుత్తమ ధర్మదీక్ష త్రిజగద్వంద్యంబయౌ దేశ కా
    లవిధుల్ చూచియు సుంతమార్చు కొనినన్ లగ్గయ్యెడిన్ రాజ నీ
    తి వికాసం బఖిలార్థసిద్ధులను సంధించున్ వృథా కష్ట న
    ష్ట విచారంబులు పెంచుపట్టుల ననుష్ఠానంబు మార్పన్ దగున్.257
    
సీ॥ నీవీర ధర్మంబు నెపమున లోక మెం
               తగ బాధనొందుచున్నది చూడు
   ప్రజలు నిల్వఁగ నీడ పడయక తినఁగూడు
               కట్ట బట్టయులేక గాసి పడిరి
   పాడువడె ధరిత్రి బలియురౌ మగలు కం
               కాళమ్ములో యనగానఁ బడిరి
   భాగ్యదేవత లట్టి పడఁతులు దుర్భర
               దారిద్య్రదేవతల్గా రహించి
               
గీ॥ రనుదినం బేకభుక్తంబు నవని శయ్యం
   గొని ప్రపంచోన్నతుండవై మనఁగఁదగిన
   నీవు నన్న్యాసి వేషాన విలువ, గుండె
   దిటవు చెడియెఁ గొండంత సంకటము గలిగె. 258
   
ఉ॥ నీ రవివంశ గౌరవమునిల్పుట పూర్వమునుండి వచ్చు నా
    చారము మాకు వందనముసల్పి వచించెద నట్టివానితో