పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


గీ॥ ముప్పదియు నాఱు కులములు భూరమణులు
    పాదములు గొల్వఁదగు జగత్పావనుండ
    నడవిఁ బడరాని యిడుమలు బడుచునుంటి
    ధర్మనిష్ఠుర వీరవ్రతంబుఁ బూని.” 244
    
క॥ అని మానసింహ భూవరులు
    డనఁగ బ్రతాపుఁడును "మత్కు లాభరణులు పూ
    ర్వ నృపాలుర ధర్మము నే
    ననుసరణ మొనర్చుచుంటి సతిదృఢ నిష్ఠన్ 245
    
మ॥ స్థిరదీక్షన్ గొని ధర్మదేవత నుపాసింప బ్రయత్నించు నా
    నరులన్ గష్టము లెల్లమార్కొను! ననం తత్యాగ ధైర్యంబు ల
    క్కరయౌ వారికిఁ జీఁకటుల్ బలియఁ జుక్కల్ తేజములు బెంచు నా
    కరణిన్ ధీరులు పెంచుచుందురు విపత్కాలంబునన్ దైర్యమున్. 246
    
సీ॥ దృక్పధంబున భేదమే కాని దైవ ద
          త్తములెకా కష్ట సౌఖ్యములు రెండు
    రెంటిలోఁ గష్ట ముత్కృష్టమం డ్రదితాను
          వలగొన్నవారి పాపములు గడిగి,
    ప్రకృతి కజ్ఞానసం పదలఁ బెంపొందించి,
          శమదమాదిగుణాళి సంతరించి,
    యఖిలజగం బీశ్వరాధీనమని తెల్పి
          యుత్తమ జ్ఞానంబు నొందఁ జేయు
          
గీ॥ నిరత మాత్మ శోధనచేసి నిశిత శిక్ష
   పెంచి కష్టానుభూతి ప్రాపించి గాక
   మనుజుఁ డొకకోటి యోగముల్ మరగియైన
   నుత్తమోత్తమ పురుషత్వ మొందఁగలఁడె 247
 
మ॥ అమరోద్యానముఁబోలె నెల్లెడ సమగ్రానందమున్ బెంచి లో
    కముఁ గల్యాణపు మండపంబటు వెలుంగన్ జేయు స్వాతంత్య్ర ధ
    ర్మమహాదేవత మున్గెఁ గిల్బిష సముద్రంబందునన్; రక్త హ
    స్తములన్ లేపినలేచు లేవదణుమాత్రన్ రిక్తహస్తంబులన్ 248 248