పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

శ్రీనివాసవిలాససేవధి


రవళి నేగెడు రతిరాజుచందమున
రత్నవతీనగరంబున యువతి
రత్నంబు గైకొన రహి నేగె నంత940.
వచ్చినయారాజవరుని భూవరులు
విచ్చలవిడిఁ జూచి వీనిరూపంబు
వీని విలాసంబు వీని వైభవము
వీని యొయారము వెలఁది కల్గొనిన
మసలను వరియింప మనమునఁ దలఁప
దని యాస లుడిగి తియ్యనివిల్తుకాక
లురవడి మది నంట నుస్సురు మనుచు
పొరలుచుఁ జింతతోఁ బొగులుచుండంగ
నారాజులను మాళవాధినాథుండు
కూరిమితో నెదుర్కొనుచు రప్పించి950.
[1] తగినబిడారు లందఱికి నొసంగి
వగమీఱ నులుపాలు వరుసఁ బెట్టించె
ఈ రాజు లందంద నీటు లుల్లసిల
నారయ నిరవలంబాయాసి నగుచు
నే నుండరా దంచు నినుఁడు సిగ్గుననె
తాను గ్రుంకె ననంగఁ దపనుండు గ్రుంకె
వీరల యనురాగవిసరంబు విరిసి
మీరి వెళ్లురికి యెమ్మెయి న పరాశ
నెలకొనెనొ యనంగ నిరుపమరాగ
మిల నపరాశ నెంతేనియు నడరె960.
నారాజులకు మోము లటు నల్లనైన
తీరునఁ దమముచే దిఙ్ముఖంబులును

  1. వ్రా. ప్ర. తనదుబిడారు