పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

శ్రీనివాసవిలాససేవధి


వినుతించు వెస మ్రొక్కు వెండియు లేదు
మొనసి ప్రదక్షిణంబులు సేయు భక్తి
పెనుపొంద భావించుఁ బేర్మినటించు
నానందభరితుఁడై యానందకధరు
నానతిఁదలపోసి యతివేగ డాసి600.
పటులీల నా గిరి బలిమి నెత్తంగ
కటిని బంగరుశాల్వ కడిమి బిగించి
మేరుశైలాయితమేయైన సాటి
గా రూఢిఁ గొన్నశిఖరసంఘములును
నల రోహణాద్రిసహస్రంబులైన
తుల సేయరానట్టి తుంగశృంగములు
మంచుకొండలకోటి మార్కొని గెలువ
మించిన కూటముల్ మిగులఁ గ్రాలంగ
ఫణిరాజఫణములపగిది మాణిక్య
ఘృణి నొప్పు సానువుల్ కెలన దీపింప610
మహనీయమందిరమండలాకృతిని
గుహలు లతాగృహకోటులు దసర
నా లతాగృహములయందుఁ గిన్నరులు
కేళిని బొందుచు గీతముల్ సేయ.
నల గీతు లాలించి యలరి యౘ్చరలు
లలితనాట్యంబులు లయమీఱ సలుప
నా నటనము మెచ్చి యచట బర్హంబు
లూని [1]కలాపిక లుగ్గడించంగ

  1. వ్రా. ప్ర. భరతులుని కళాచికలు,