పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

23



బొలుచుమేడలు మేడఁ బొలయుపుల్గులును
పులుఁగులతోఁబల్కు పుణ్యపూరుషులు
పురుషులు ధరియించు భూషణంబులును
వరభూషణమ్ముల వరలునమ్మణులు
మణికీలితంబైన మందిర గణము
గణనీయనూక్తుల క్రమమునఁగుశల
మడుగంగ నటుసేమమంతలు వడసి
నుడుల కలవిగాని నూత్న [1]విభూతి
భవనుతుఁడై నట్టి పరిధూతభవుని
భవనప్రతీహార భాగంబు నేరి530
యచల బంగరుబెత్తు లనువుగాఁ బూని
యచిరప్రభానిభం బైనఖడ్గంబు
పడఁతల ధరియించి పసిడిపుట్టంబు
కడుమిన్నగాఁ గట్టి కరతలంబులను
సవరణచెలగంగ శంఖచక్రములు
వివిధభూషణములు వెలయంగఁ దాల్చి
వరకిరీటంబు శ్రీ వత్సలాంఛనము
నురమునఁ గౌస్తుభం బొప్పు మురారి
సారూప్యమున నిల్చు జయవిజయులను
గూరిమి భజియించి కుశలము లడిగి540
తా వచ్చురాకయుఁ దడయక తెల్పి
దేవనియోగంబు దెలియ నిట్లనియె
వినుఁడు శ్రీ రమణుండు వెన్నుండు ధరణిఁ
దనలీల విహరింపఁదలఁచి యిందుండు

  1. వ్రా. ప్ర . వైభవము.