పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

శ్రీనివాసవిలాససేవధి



నడచి యావైకుంఠనగరోపకంఠ
మగుట సద్భక్తి సాష్టాంగమెఱంగి
తగువినయంబుతోఁ దడయ కేగంగ
నుద్యానవనసీమ నుండుభూజములు
విద్యాధరాప్సరుల్ వివిధకిన్నరులు450.
క్రీడామృగంబులు కేకిశారికలు
చూడనౌ హంసముల్ శుకకోకిలములు
సప్రాకృతంబులై యమలవిజ్ఞాన
దీప్రంబు లగుటచేఁ దిలకించి యతని
సేమ మరసి యక్కుఁజేర్చి సంతసిలి
ప్రేమ నాతిథ్యంబు పెనుపొందఁ జేయ
వడిఁదేఱి యాతండు వారి వీడుకోని
వడినేగి యాపురద్వారంబు గాంచె
నందు నూరును పదియారు వన్నియల
కుందనఁబులు చెక్కు గోపురంబులను460.
పులుగురా నేటిరూపులు దాల్చి మెఱుఁగు
పులుఁగురాఱాల గుంపుల డా లెసంగ
చెలఁగుడాలులు తమ శేఖరంబులుగఁ
[1]గులుకుఘాంటికులు పల్కుల నాదరింప
చలువగా డ్పొలయ నైజపటాళి వీవ
నలరుచు నొయ్యన నరుగు నత్తఱిని
వివిధమణీగృహ వీధికాతతులు
ధవళేందుకాంత సౌధప్రకాండములు
విస్తృత వైడూర్యవేదికావళులు
నిస్తుల ముక్తామణీకవాటములు470.

  1. వ్రా.ప్ర.ఘంటికల