పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శ్రీనివాసవిలాససేవధి


వనముఁ గన్గొని దానివైఖరి [1]కలరి
వినుతిసేయుచు నందు విహరించుచుండె
అపు డట్టివనభూమి హరికటాక్షమున
విపులలక్ష్మి వహించె వివిధభూజములు400.
చందన మందార చంపకాశోక'
తిందుక జంబీర దేవదారువులు
తాల తమాల హింతాల తక్కోల
నారికేళామ్ర మన్మథ సింధువార
పారిజాతార్జున పనస శైలూష
నారంగ పున్నాగ నాగకేసరము
లామలక కదంబ కాశ్వత్థ వకుళ
తామస తింత్రిణీ తపసాఖ్యములును
న్యగ్రోధ సప్తప ర్ణాశ్వక ర్ణార్క
శిగ్రుకరంజక శ్రీఫల కుటజ410.
కరవీర మరువక కంకేలికోల
కురవ కురంటక కోవిదారములు
పిచుమంద జంబూ విభీతక హరిత
లిచు ళాభ యాలర్క నింబ ఝింటికలు
సాల కాకోల రసాల దాడిమలు
పాలాశ శాల్మలి పాటలంబులును
సురభి ప్రియాళ రించోళ ఖర్జూర
సరళ వంశాగురు సహకారములును
తిలక లవంగ జాతిక పూగ ఖదిర
కలివాస శింశుపా కర్ణికారములు420.

  1. వ్రా. ప్ర. కలిగి