పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము.

15



[1]హరుఁడు విస్మయమొందె నది చూచి బెదరి
పరమేష్ఠి నివ్వెఱపాటున నిలిచె
అప్పు డాపెనుబంది యతిజవం బంది
యుప్పొంగు ప్రళయకాలోదధి జలము330
చొచ్చి చెర్లాడి హెచ్చుగ సుళ్లురేచి
విచ్చలవిడి నొక్క వేదండవరము
కొలను సొచ్చిన యట్లు కొందలమెసఁగ
నల మందరము కవ్వమై త్రచ్చుకరణి
బిరబిర తెరలుబ్బి పెంపొంది మ్రోయ
నురుగు తెట్టియలు మిన్నుల నిండ నెగయ
వెసవెస పాతాళవీధిఁ గలంచి
యసురపుంగవు హిరణ్యాక్షు గన్ గొనియె
అట్టిదైత్యుని భీకరాకారమునను
గట్టు కైవడి తొలంగఁగ నిల్చి యెదుట340
కనుగ్రుడ్లు నిప్పులుగ్రక్కంగ నోరు
పెనుబొంద చందాన బెట్టుగాఁ దెఱచి
యడరినపిడుగుల ట్లార్చి యెంతయును
పొడవైన చేతుల పూన్కి నంబుధులు
తెరవిచ్చి పాయలై తెఱువిచ్చి తొలఁగ
నురువడి[2] నడరిన యురువేగమునను
గిరగిర దిరుగుచుఁ గెరలి లోఁదెరలి
మొరయు నార్భటి మారుమొరయున ట్లుబికి
సుడివడ నీరముల్ సుడిఁబడి కలగ

  1. వ్రా.ప్ర. హారూఢ.
  2. వా. ప్ర. నడవినయ్యూరువేగ.