పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

శ్రీనివాసవిలాససేవధి


యత్యంతసమ్మోద మలర నిట్లనియె.
మౌనీంద్రులార యిమ్మహి రహస్యంబు
జ్ఞానవిజ్ఞానైక సాధనస్థాన
మరయంగ శుద్ధసత్వాస్పదం బైన
పరమపదం బొండు భావింప శేష260.
గిరి యొండుగాక యీక్షితిని 'వేఱొొండు
కరము చూడఁగ వినఁగాఁ దగ దెందు
నైన వైకుంఠ [1]మమర్త్య గమ్యంబు
గానఁ బ్రత్యక్షమై కనుఁగొనరాదు
దేవమనుష్యాది దృశ్యమై భూమి
నీ వేంకటాద్రి యింపెసఁగు నట్లగుట
వైకుంఠము దొఱంగి వనజాక్షుఁ డిదియె
చేకొని విహరించు శ్రీకాంతతోన
నిది మీకుఁ దెలుపంగ నేఁ గోరుచుందు
నది మీర లడుగుట నద్భుతం బయ్యె270.
నద్భుతం బాగిరి యతులితమహిమ
అద్భుతతర మందు హరివిహారంబు
నా కథావృత్తాంత మత్యద్భుతంబు
లోకింప నింతయు లోకాద్భుతంబు
ఆదివరాహమై హరి సృష్టి వేళ
ప్రాదుర్భవించుట పరమాద్భుతంబు
కిటిరూపమున నిట్టి క్షితినుద్భవించి
చటులత వేంకటాచల భర్తయైన
పుణ్యచరిత్ర మద్భుతతమం బని య

  1. వ్రా.ప్ర. మత్యన్ గమనీయంబు.