పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

231


వినుతించి యో దేవ వేగ నన్ బ్రోవ
నెనరునఁ గరుణించి నీ విట్టి వేళ
నిటు వచ్చితివి నా దభీష్టదైవంబ
వటుగాక నీ వెన్ను నంటి యా వెన్నుఁ
డెక్కుట తగుగాక నే నెక్కఁదగునె
యెక్కువ యీ మాట కిదె మ్రొక్కినాడ1330
నపచార మిది యట్టి యైశ్వర్య మొల్ల
కృప నియ్యడనె యున్కి కేవలహితము
అని భక్తిమీర సాష్టాంగమై [1]యెఱఁగి
వినయంబునను నిల్చు విధము నీక్షించి
ఖగరాజు వసురాజుఁ గౌఁగిట నలమి
తగునట్ల బలికితో ధరణీతలేంద్ర!
ఇంత భక్తుఁడ వౌట యిందిరారమణుఁ
డెంతయుఁ గరుణించె నిది నీకె తగియె
నయిన నాభుజముల నలరి నీ పురికి
బ్రియమునఁ గొంపోదు ప్రియము దీపింప1340
నని యానృపాలుని నక్కునఁన్ జేర్చి
కొని తెచ్చి జగతికిఁ గుతుకం బెలర్ప
రాజ్యాభిషేకంబు రమణ గావించి
పూజ్యత మ్రోయ నప్పుడె మళ్ల నరిగె
ఈ కథ వినువారి కెందు నాపదలు
బైకొన వెంతటి ప్రారబ్ధ మున్న
నుద్ధరించును వసు నుద్ధరించుక్రియ
సిద్ధసంకల్పుఁడా శ్రీనివాసుండె

  1. "మైయరిగి " వ్రా. ప్ర . పాఠము.