పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

225


శంఖుఁడను రాజుకథ.


మునివరుఁ డాకథ ముందుగాఁదొడఁగి
వినుతవృత్తాంతంబు వివరించె నిటుల
మునుపు [1]హైహయ దేశమున శ్రుతాఖ్యుండు
జనపతి యై యుండు శంఖుఁడన్ సుతుఁడు
జనియించె నతని కా శంఖభూవరుఁడు
దనర బ్రహ్మాదిచందంబునఁ జాల
హరిభక్తుఁడై వైష్ణవారాధనంబు
సరగ సల్పుచు వెన్ను సాక్షాత్కరించ
వలసి యనేకము ల్వాజపేయములు
నల రాజసూయము లశ్వమేధములు1190.
విశ్వజిత్సత్రాది వివిధయజ్ఞములు
శాశ్వతికాసక్తి సవరించి హరిని
పొడగాననికొఱంతఁ బూని శోకించు
నెడ కరుణార్ద్రుఁడై యీశ్వరుం డతని
కనియె నదృశ్యత నందఱు వినఁగ
జనపాల నీ కింత సంతాప మేల
ననుపమం బగు వేంకటాచలంబునను
సనకాదిసేవ్యమై స్వామిపుష్కరిణి
యను నొక్కసర మున్న దచ్చట నియతి
ననుదినంబు మునింగి యజియించి నన్ను1200.
గనుఁగొనియెదవు శంక దొలంగు మింక
నను డాలకించి హైహయరాజసుతుఁడు
ఘనవిస్మయంబు బొంగఁగ మెయి పడక

  1. "హ్లేహయ ” వ్రా. ప్ర. పాఠము.