పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

223


నెమిలితత్తడిరౌతు నిష్ఠురహత్య
గ్రక్కునఁ దొలగంగఁ గని పర్వములను
మక్కువ మీఱం గుమారధారికను
చనిచని స్నానంబు సలుపుచునుండ

అగస్త్యాదిమునులచ్చట హరికై వెదకుట.


ననఘు లగస్త్యాదియమిచంద్రు లందు
వలగొని యరుగుచు వాయవ్యదిశను
తెలియ నా గిరి యొక్క దేవరూపమున1140.
గనిపించి తమకుఁ బల్కక డాగురింపఁ
గని విస్మయమున నాకడ నంతరమున
నవలతాగుల్మవనములరంజిల్లు
వివిధతీర్థంబులు వెసఁ జూచుకొనుచు
నల తూరుపున సనకాదియోగితతిఁ
దిలకించి హరి మాకు దృశ్యుఁడౌ నెందు
నని యడుగఁగ వార లటు పశ్చిమమునఁ
జనుఁ డింద్రు డందు నిశ్చయము దెల్పునన
నరిగి యచ్చట నింద్రు నడుగ నతండు
హరు డుండు కపిలతీర్థాంతికంబునను1150.
తెలుపు నాతం డన తిరిగి యచ్చోటఁ
బులితోలు భూతియుఁ బునుకకంచంబు
నెలవంకపూవును నిడుదకెంజడలు
నలుపెక్కు కుత్తుక నాగభూషలును
వెలుగు కన్నులు కల్గి [1]వెలయు ముక్కంటిఁ
జెలిమిఁ గన్గొని మ్రొక్కి సేవించి యడుగ

  1. “కన్నులుకుల్కి వెలయు” వ్రా.ప్ర. పాఠము