పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

శ్రీనివాసవిలాససేవధి


బిగువుగా నారచే బిగియించి కట్టి
వగవక వేఱొక్క వల్కలం బూని
యుదుటగుబ్బల హత్త నుత్తరీయముగఁ
గదియించి రత్నమేఖలఁ దాల్పనైన
తనకౌను [1]కౌనుకోదర్భతా డనక920
నెనయించి వేదంబు నిల మునుల్ బట్టి
గాదె పూజ్యతఁ జెందఁగలిగి రభృంగి
వేదంబు చేపట్టి వేల్మికుండములు
వెలయించి యగ్నికి వింతసంతసము
చెలఁగఁ దృప్తియొనర్పఁ జెంగట నిలిచి
పాకయజ్ఞము సేయు ప్రౌఢియుఁ దానె
గైకొని యతిథిసత్కారంబు నేర్చి
ఈలాగు గరితల కెనయు శీలమున
మేలిమి రంజిల్ల మెఁలగుచునుండెఁ
అంతట నింద్రుఁ డ య్యలివేణిమీఁది930

ఇంద్రుఁడు గౌతమాశ్రమమునకు వచ్చుట


చింత యాపగలేక చిత్తజుకేళి
నెటులైన నయ్యింతి నెనసి కూడంగఁ
గుటిలత నూహించుకొని పనిలేని
పనికి నా గౌతమభవనంబునకును
నరుగు నాతిథ్య మాయన సేయఁదలఁప
నరమాటనే యొప్పి యానాఁడు నిలుచు
నిలిచి ముచ్చటలాడు నెపమున నట్టి
నెలతఁ గన్గొనఁ గొన్ని నీటులుసేయు

  1. "కౌనకో" వ్రా. ప్ర పాఠము.