పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

207


లూరిచి యెనయించి యుల్లాస మెల్ల
తీరిచి యొనరించి తెరవ యంగములు
వన్నెకన్యాసృష్టి వన్నె మీఱంగ
నెన్నెన్ని యూహల నెన్ని భావించి
భావజశరధార పదనుగాఁ దివిచి750.

పూవుఁబోణిగఁ జేయఁ బూని యస్థిరత
దొరలక కడఁద్రోచి తోయదద్యుతులు
కురులుగాఁగ కళంకుగొనక చందురుని
కైపునె మోముగాఁ గౌచుఁ బాయించి
చాపలరమణీయ చాపలశ్రీలు
కనుఁగవగా నల్లె కడకొత్తి విండ్ల
నునుసోయగములు కన్బొమలునుగాఁగ
మైల దొలంగించి మంచి యందముల
డాలుచెక్కులుగాఁ దుటారంపుపరుస
దనము బాపి ప్రవాళతతి రంగు మోవి 760.

గను త్రాసమూడ్చి చక్కని ముత్తియముల
తెలి నిగ్గు దంతపంక్తిగఁ జమ్ముదీర్చి
వలనొందు శ్రీకారవైఖరుల్ వీను
లును గాఁగ వాఁడి నల్గుట మాన్చి నవ్య
కనకపురుచి నాసగాఁ బాఁచిదుడిచి
చిందమందము కంఠసీమగా గుహల
నొందనియ్యక గిరియుగలక్ష్మి గుబ్బ
చనుఁగవగా [1]గౌరుజవరకరీక

  1. వ్రా. ప్ర. గెరల్ జవిరికరీక