పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థాశ్వాసము.

195


ముద్దులపల్కులు మోడియల్కలును
మెరయించి విటులచే మేలైన నగలు
దొర [1] కినవస్తువుల్ దువ్వటంబులును
వేగిరంబుగ దోఁచు వితముల కేమి
నాగవాసమువారి నయ మది గాదె
అందరిలో జాణ వందురు నిన్నె
యిందుఁ జూచెదము నీ యెల్లనేరుపులు
ధరణి దూర్వాసుఁడన్ తపసిని నీవు
మరులు పుట్టఁగ సేసి మదిఁ గరగించి460.
వలపించి తప మెల్ల వమ్ము గావించి
కులుకులన్ లోఁజేసు కొందువైతేని
నెఱజాణ వని మెచ్చి నెలతల లోన
బిఱుదు లిత్తును నీకు బిత్తరియిదిగొ
యవసరం బని చాల యాస బుట్టించి
దివిజేశుఁ డంప నా తెఱవ యిట్లనియె
నగవైరి దేవర నాటకశాల
మగువలలో నెంతమాత్రపుదాన
రసిక మేనక యుండ రంభ యుండంగ
నొసపరి యైన తిలోత్తమ యుండ470.
పుంజికస్థలి యుండ భోగిని యుండ
మంజుఘోషయు నుండ మరియు నూర్వశియు
నుండ వరూధిని యుండ నా హేమ
యుండ నిందఱిలోన యూరకే నన్ను
మన్నన సెలవిచ్చు మాత్రమే కాక

  1. "దొరకైన " వ్రా. ప్ర. పాఠము.