పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

165


చెలి పైఁటగాడ్పుల సేదఁదేరుదురు
తడవుండి ప్రొద్దుబోఁ దడవి వేఁ దరలి
యడుగడుగుకు నట్టివగుచప్పరంబు
లెన్నైన కనుఁగొంచు నెడ మెచ్చికొంచు
తిన్నగా గిరి యెక్కి దిక్కుదిక్కులను
నరవింధ్యముగ నిండి నగరమున్ వనము
నెరసి యిం తెడలేక నిలిచె నాపరిష770.

ఆనాటి శ్రీకాంతుని యలంకారవర్ణనము.



ఆనాఁడు శ్రీకాంతు డందరిమదుల
నానంద ముప్పొంగ నమిత వైభవము
లలరంగా నంగదహారకిరీట
వలయ కుండలమాణవకనికరములు
గ్రైవేయమేఖలాకంకణోర్మికలు
పావనమంజీరపదకింకిణులును
మెఱయంగ ధరియించి మిసిమికడాని
మెఱుఁగులదుప్పటి మెఱుగుఁగాఁ గప్పి
చొక్కపు మంచి కస్తురితిలకంబు
చక్కఁగా దిద్ది వాసనగ్రమ్ము కలవ 780.
మలఁది క్రొవ్విరిదండ లలరంగఁ దాల్చి
కలుముల నీను చక్కనిపూవుఁబోణి
రతనంపుపంటలరమణి నిర్వంక
నతిలీల నుంచుక యఖిలభూభరము
తలపూను ఫణికులాధ్యక్షుపై నెక్కి

శ్రీ కాంతుఁడూరేగుట.



తెలివికట్టాణిముత్తియములగొడగు
సురరాజు పట్టంగ స్ఫురదకళంక