పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

శ్రీనివాసవిలాససేవధి


కైలాసగిరిని పెకల్చెను కేల
దెేవర లింద్రాదిదివిజుల మునుల
బ్రోవగ నల వారిఁ బొలియించవలయు
శ్రీశైలపరిసరసీమను దైత్యు
లాశీతనగదక్షిణాంబుధిమధ్య 1180.
మంతయు విహరింపు చచటి సజ్జనుల
నెంతయు బాధించు నెడల నెవ్వారు
వారిని వారించువారలే కాక
నారయ రక్షకు లన్యు లున్నారె
శరణంబు దెవర చరణంబె మాకు
కరుణించి మము బ్రోవగదవె ముకుంద
అని విన్నవించిన యా శ్రీనివాసుఁ
డనుపమకరుణారసాబ్ధిఁ దెేలించి
చిజునవ్వు మోమున జిందులుద్రొక్క
[1]నొరపుజూపులఁ జూచి యూరడింపుచును1190
సురలార మీరింత సొలయంగనేల
కఱకురక్కసుల నే ఖండించువాడ
దనుజుల క్షణమాత్ర తలలుద్రవ్వించి
పనుపుదు నా జమునట్టణంబునకు
జడియక సుఖముగాఁ జరియింఫు డింక

శ్రీనివాసుఁడు బ్రహ్మాదులకుఁ గోరిన వరములిచ్చుట.

నడుగుడు కాక్షించు నట్టివరంబు
లిచ్చెద నిచ్చోట నెడపక యిపుడె

  1. వ్రా. ప్ర. వెరపు జూపు