పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

79


చిత్తప్రసన్నత చెలిమి మృదూక్తి
పతియె దేవతగాఁగ భావించు తలఁపు
వ్రతనిష్ఠ దయయును [1] నమ్రతయోర్పు
నవరసజ్ఞతయు ధర్మానుకూల్యంబు
లివి యెల్ల కులసతి కెనయు లక్షణము
లగుట నీగుణము లింపగు నలంకార
ముగఁ బూని తను నెల్లపొలతులు వొగడఁ 50
దనరుచుఁ గొందఱి దనయులవరుసఁ
గని మన్చి కంచంతకాపురంబుగను
దంపతు లన్యోన్యదత్తభావముల
నింపొంది కొన్ని యేం డ్లిట్టు లుండంగ
జనకుఁడు జననియున్ జనినంత వారి
కనుపమంబుగ బిత్రుయజ్ఞంబు దీర్చి
విహితకర్మములెల్ల వెలయఁజేయుచును
బహువత్సరంబులు ప్రబలి వర్తించె
నంతటఁ గొన్నాళ్ల కావిప్రవరుస
కెంతయు భాగ్యంబు వెడలు దుర్దశను 60
పొలములోఁ బశువులం బులులు రోగములు
పొలియించె చోరు లప్పుడె యింటనుండు
ధనముల్ హరించిరి ధాన్యం బకాల
ఘనవర్షముల వెల్లిగలిసెను దాత
యీవికి లోభించె నిచ్చినరుణము
లేవగలనురాక [2] యిజుకులఁబడియె

  1. వ్రా. ప్ర. సంచవయోర్పు.
  2. వ్రా. ప్ర. హిజుగుల.