పుట:శ్రీనివాసవిలాససేవధి.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము.

75


స్వామిపుష్కరిణీతీర్థ మాహాత్మ్యము.

వినుఁ డామహాతీర్థవిభవ మెంతయును
మునులార! తెల్పెద ముదము రంజిల్ల 1800
క్షమ ధనుర్మాసశుక్ల ద్వాదసులను
విమలారుణోదయవేళలయందు
భువిఁ గల్గు గంగాదిపుణ్యతీర్థములు
జవమున స్వామిపుష్కరిణిలో వచ్చి
తమయందుఁ గ్రుంకు పాతకులపాపములు
తము నంటకుండఁ బ్రార్థన సేయుచుండు
నావేళ నందు స్నానాదికృత్యములు
గావించువారికిఁ గామితార్థములు
సిద్ధించు నిద్ధరఁ జెలఁగు గంగాది
శుద్ధనదీసరస్తోమావగాహ 1810
పుణ్యఫలం బబ్బు పురుషోత్తముఁడు న
గణ్యకారుణ్యవీక్షలఁ బ్రోచు వారి
ననుచు రహస్యార్థ మమ్మునీశ్వరుల
కెనయ సూతుఁడు దెల్చె నింపు దీపింప
అనుచుఁ జిత్రార్థసమర్థనాకలిత
ఘనసర్గవిశ్రుతకవిముఖ్యుపేర
విపులానుభావభావితసంవిధాన
కపటనాటకజగత్కారణుపేర
భాసురాంగశ్రుతిభారతిభవ్య
లాసికాగీతవిలాసునిపేర 1820
తారకాంతకపితృద్వంద్వా[1]ద్యతీత


  1. వ్రా. ప్ర. న్వధీత.