Jump to content

పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42 శుకసప్తతి



నహుషభూపాలు మన్నన కొప్పుకొనియెనే
స్త్రీరత్నమైన శచీపురంధ్రి
యల సింహబలుని మాయలఁ జిక్కి చొక్కెనే
విపులసద్గుణమాన్య ద్రుపదకన్య
శబరాధిపునిదురాశలకు లోనయ్యేనే
రతినిభాకృతి భీమరాజపుత్రి
తే. తొల్లిటి మహాపతివ్రతల్ దుర్మదాంధ
కాపురుషు లంగభవశరాఘాతవికల
చిత్తులై తముఁ జేరి యాచించినపుడు
సిగ్గు వోనాడుకొనిరఁటే చిగురుఁబోఁడి. 155

ఆ. ప్రాణహాని మానభంగంబు నగు నన
కెంతపనికిఁ జొచ్చితే మృగాక్షి
జగతి నీమనంబు "తెగువయే దేవేంద్ర,
పదవి" యనెడుసుద్దిఁ బొదలఁబోలు. 156

క. పతిభక్తి గలుగుసతికిన్
వ్రతములతో గొడవ యేల వఱలు సుకృతముల్
పతిభక్తి లేని చెనఁటికి
వ్రతములు చను వేయి యొక్కవ్యభిచారమునన్. 157

వ. కావునఁ గులాంగనాతిలకంబునకుఁ గలకంఠీసముచితకృత్యంబు పాతివ్రత్యంబు నీవు వైపరీత్యం బగుప్రయోజనం బాచరించితి విట్లైన నిహపరంబులకు దూరం బగుదు వని సుభాషితంబులు పచరించిన నవ్వచనంబులు కర్ణపుటంబులకు జిలుగుటంపములుకులపొలుపు దెలుపఁ గలికి యులికిపడి రూక్షేక్షణంబుల నాశుశుక్షణికణంబులు చిలుకఁ జిలుకం గనుం