పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రథ్యవేగంబున ననూరుసారథి రథంబు ప్రతివిఘట్టనక్షుణ్ణనక్షత్రక్షోదపాళీచుళుకితోర్ధ్వాండభిత్తియై యుత్తరాయణంబు గైకొని కులూతశాతోదరీకపోలముకురబింబంబులం బ్రతిబింబించె. సవ్యాపసవ్యక్రమంబునం జక్రమిథునంబుల నెట్టుకొని బిట్టేసియేసి విసిగి నిల్చి మనోభవుండు నిగిడించిన నిట్టూర్పునుం బోలె నిశాసమయంబుల నిండువెన్నెలలోనం జిన్నిచిన్ని నులివేఁడివడి పొడచూపె. కేదారక్షేత్రంబులం గలమగోపిక లొడికంగా దంచి (సడించిన) నిద్దంబులగు [1]దుద్దుగడు ప్రాసంగుఁబ్రాలు సద్యోమార్జనావశంబున నతిస్నిగ్ధవర్ణంబులై కర్ణాటదేశ[2]తాటంకినీ దశనవజ్రాంకురంబుల కాంతిసంపదలఁ [3]దలపించె. నీహారవ్యపాయంబున నిర్మలంబులై బహుళపక్షప్రదోషంబులయందు దారకంబులు వికచకుముదకోరకంబులు *(కెలంకులఁ) గొలంకులలోనం బ్రతిబింబించి మదకలకలహంసత్రోటికోటీవిఖండి మృణాలదండఖండంబుల భావంబు భజించె. హృదయోత్కంఠాతిరేకంబునఁ గంఠమూలకఠోర కాలకూటవిషమషీ కళంకపంకచ్ఛాయచ్ఛాటా[4]కంఠోక్త భువనరక్షాదాక్షిణ్యుండు దాక్షారామ భీమేశ్వరుండు దక్షిణజలధివేలావలయితంబులగు నేలాలవంగలవలీమతల్లికా కుడుంగక్రోడంబులం గ్రీడించుటకునై సారంగలోచనలుఁ దానును గోరంగి వెడలె. [5]వలవలని మంచుఁ దుప్పర ముసురుజడిం దడిసి జడనుపడి [6]వేగుఁబోఁకల పోఁక పూబాళల పరిమళంబులఁ [7]బుక్కిలించి యుమియుచుఁ, బక్కణంబులలోన నల్లనల పొలుపారు నడవికరువలి యసమసవిషమ కుసుమఫలక్రీడామతల్లికల [8]మల్లు పెనంగి డస్సిన భిల్లపల్లవాధరల గల్లఫలకంబులఁ గ్రొత్త యుదయించు చెమట చిత్తడి యుడిపె. కాశి శ్రీశైల [9]కుంభఘోణ శోణార్క కాంచీ కాంచనసభా కాళహస్తి కురుక్షేత్రాది పుణ్యస్థానంబులం గూపవాపీతటాకకుండికా[10]ప్రస్రవణశ్రోతస్వినులం బ్రత్యూషకాలంబులం బరమర్షిసార్థంబు తీర్థంబాడె నివ్విధంబున మాఘమాసవాసరంబులు వసంతసమయసామంతంబులు జరగుచుండ నా చండాలాది మసుష్యులకు భుక్తిముక్తులు ప్రసాదింపఁజాలి మాహేశ్వరులకు మహోత్సవంబు పాశుపతులకుం బ్రీతి కాలాముఖుల కవలంబంబు ముములకు మనికి జటాధారుల కాధారంబు పరివ్రాట్టులకుఁ బట్టుఁగొమ్మ వేదాంతులకు సంతోషం బాగమికులకు భాగధేయంబు మాంత్రికులకు మనువు తాంత్రికులఁ దావలంబు పౌరాణికులకుఁ [11]బ్రాణం బౌపనిషదుల కుపాయంబు ముముక్షులకు రక్ష శంభునకు విస్రంభస్థానంబు శాంభవికి [12]హృత్కరంబంబు హేరంబునకుం బ్రియంబు తండువునకుఁ బండువు కుమారస్వామికిం బ్రేమాస్పందంబు భృంగిరిటికిం దంగెటిజున్ను దురితతరుషండఖండనంబునకు గండగొడ్డలి యఘపటలతిమిర[13]సముదాయాహిమఘృణిసంతానంబు సంతాపశాంతికి భాగీరథీప్రవాహంబు శివరాత్రి పుణ్యకాలం బేతెంచిన.

34


సీ.

ఆ వణిక్పథమున కనతిదూరంబున
          గవ్యూతియెడ నుదక్పశ్చిమమునఁ
బర్వతోపత్యకాపర్యంతతటమున
          సికతా[14]తినిర్మలక్షేత్రసీమ
మాలూరతరుషండమధ్యభాగంబునం
          బ్రస్రవణాపగాపార్శ్వభూమిఁ
గుసుమవాటికలలోఁ గువలయాంభోరుహ-
          కుముదమండితమైన కొలనితోడఁ


గీ.

గోటతో గోపురములతోఁ గుట్టిమాట్ట-
మండపంబులతో మహామహిమ నొప్పు
[15]నాదిమధ్యాంత నాగేశ మనఁగ నొక్క
పుణ్యతీర్థంబు [16]త్రైలోక్యపూజితంబు.

35


గీ.

అందు శేషప్రతిష్ఠితుం డమృతదివ్య-

  1. తా. మద్ది ... పుడుంబ్రాలు నిగనిగడాలు సద్యోమార్గావకాశంబున విశుద్ధస్నిగ్ధవర్ణంబులగు
  2. తా. తాటంకినుల
  3. ము. దలంచె
  4. ము. కుండు భువన
  5. తా. పలపలని
  6. ము. వ్రేఁకలగు పోఁక
  7. తా. బుక్కిలించుమియుచు
  8. తా. మల్లువెనంగి
  9. తా. కుంభకోణ కోణార్క
  10. తా. ప్రస్రవస్రోతస్వినులం
  11. తా. ద్రాణం
  12. ము. హృదయోత్కంఠయు
  13. తా. సముదయాహి
  14. తా. వినిర్మల
  15. తా. నాదిమధ్యంబు
  16. తా. నాగేశపూజితంబు