పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

[1]బ్రహ్మ యెక్కెడి జాలపాదంబునకుఁ గేళి-
          వసతియైన సరోజవాటితోడ
నైంద్రవాహనమైన యైరావణగ(జంబు
          నోరూర్చు మోకయిందువులతోడ)
వైష్ణవరథమైన వైనతేయున [2]కాఁగ
          నిరవైన ప్రాకారపరిధితోడఁ
గౌమారయానశిఖావళంబునకుఁ దాం-
          డవమాడ సొబగైన గవనితోడ


గీ.

వేడ్క [3]మాహేశుఁ డెక్కెడి వృషభరాజు
దాఁక నిల్చిన కేళిభూధరముతోడ
సకల[4]శక్తినివాసమై చాలనొప్పు
చండిభవనంబు పొత్తెంచె సచివసుతుఁడు.

105


మ.

[5]తన దౌశ్శీల్యము తా నెఱుంగుట వెలిన్ దౌదవ్వులన్ నిల్చి దు-
ర్జనుఁ డాతండు లలాటభాగమున హస్తద్వంద్వమున్ మోపి యొ-
య్యన లోలోన నమస్కరించెఁ బటుగర్వారంభసరంభశుం-
భనిశుంభప్రథనక్రమప్రకటబాహాకేళికిం గాళికిన్.

106


ఉ.

మాలెత విందు బ్రాహ్మణకుమారుడు పక్కణవాసి వేణుకం-
డోలమునందుఁ దెచ్చిన గఠోరితచంద్రిక నిర్ఝరాపగా-
కూలమునన్ భుజించి ఘనగోపురవేదిక నిద్రవోయె న-
య్యాలరి బ్రాహ్మణుండు తుహనాచలకన్యకయాశ్రమంబునన్.

107


వ.

మఱునాఁడు ప్రాతఃకాలంబున నిర్ఝరాంధఃప్రవాహంబున నవగాహనంబు చేసి కపటసంధ్యావందనంబును గృతకజపంబును (మిథ్యా)సూర్యోపాస్తియు నడపి బ్రాహ్మణ[6]బ్రువుండు.

108


సీ.

దంతిదంతార్గళస్తంభభారముతోడ
          రాజిల్లు ఘనగోపురములు సూచి
గండశైలచ్ఛేదఘటితమై యొరపైన
          మేటికొమ్మలతోడి కోట సూచి
యమృతదీధితిలోని హరిణంబు వెఱపించు
          సౌధాగ్రసింహధ్వజములు సూచి
యాటమండపముపై నభ్ర ముల్లేఖించు
          జాంబూనదత్రిశూలంబు సూచి


గీ.

చమురుగా(కులు కుసు)మగుచ్ఛములు వోలె
సకలశాఖోపశాఖల సంశ్రయింపఁ
బుష్పితాశోక[7]పాదపంబులునుఁ బోని
నింబములు సూచి యతఁ డద్భుతంబు సెందె.

109


ఉ.

కాళికదివ్యమందిరము (కట్టెదురం బశుకంఠ)నాళకీ-

  1. తా. బ్రాహ్మి
  2. తా. కుఁగా
  3. ము. మాహేశ్వరంబైన
  4. ము. భక్తనివాసమై
  5. ము. తనదౌ శీలము
  6. తా. ప్రవరుండు
  7. ము. పాదపంబులను జూచి