పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


 [1]రురుం డాయురర్ధం బొసంగి యయ్యంగన బ్రతికించెననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై యాత్మజుండగు బభ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) శరాహృతప్రాణుండైన నులూచి యను నాగకన్యక రసాతలంబుననుండి యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము. మంచితనంబు లాఁడువారికి మగవారికి సరియ యద్ది యటులుండె నా పంతంబు వినుము.

80


ఉ.

నాకు మనంబునిండ నొక నమ్మిక సేయుము (సర్వకాలమున్)
గైకొనువాఁడ [2]నిన్ ననుము కాదన కెక్కడకైన వచ్చెద
న్నీ కొకటయ్యెనేని యవనీసురమన్మథ నిర్విశంకత
న్నాకముఁ జూఱ[3]వెట్టెద ధనంజయతీవ్రశిఖాముఖంబునన్.

81


వ.

అనిన విని సంతోషించి సుకుమారుండు.

82


సీ.

కలహంససంపద గల కలక్రేంకార-
          కలకలంబైన యీ కొలను సాక్షి
ప్రసవసౌరభనటద్బంభరంబైన యీ
          [4]ఫలినీలతామంటపంబు సాక్షి
ప్రచ్ఛాయశీతలోపరిభాగమైన యీ
          శశికాంతమణిశిలాస్థలము సాక్షి
తరులతాగుల్మసంతతపిధానాతప-
          వ్యాపారమైన యీ వనము సాక్షి


గీ.

మకరకేతను పాదపద్మములు సాక్షి
రతిమహాదేవి జఘనభారంబు సాక్షి
సత్య మెన్నఁడు నినుఁ బాయ సమ్మతించి
కౌగిలింపఁగఁ నీఁగదే కమలవదన.

83


వ.

అనినఁ జండాలి కరారవిందంబులు [5]మొగిడిచి సవినయంబును *(సగౌరవంబును) సానురాగంబునుగా నతని కిట్లనియె.

84


ఉ.

నేఁడు గృతార్థులైరి జననీజనకుల్ ఫలియించెఁ బుణ్యముల్
నేఁడు పురాకృతంబు లవనీరుహమూలనివాసియైన కా-
ట్రేఁ డిలు[6]వేల్పు నేఁడ యొనరించె మనోరథద్ధిసంపదల్
నేఁడుగదా (సువార మిది నీ కృపఁ) గంటి ధరాసురోత్తమా.

85


ఉత్సాహ.

మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేఁ
గలయ [7]నీళ్ళనాడి కడవ గ్రంత యంటుకొనుటకై
కొలనఁ గ్రుంకిపోవుచుండి కుసుమబాణనిభుని ని-
న్నలఘు(తేజు) లోచనంబు లలరఁ జూచి వలచితిన్.

86


గీ.

ఏమి సేయుదు నీకు నెట్టిత్తు నన్నుఁ
[8]బచ్చిముట్టునఁ గలుగు బీభత్స మెఱిఁగి
[9]యిచ్చగింపక యుండ నేనెట్లు నేర్తు
నధికతరమైన మన్మథాయత్తు నిన్ను.

87


వ.

అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె.

88
  1. తా. రురుండనువాఁడు తన యాయువందు నర్ధం బొసంగి
  2. తా. నిన్ననిన
  3. తా. పట్టెద
  4. ము. వలని
  5. తా. మోడ్చి
  6. ము. వేలుపౌచు నొనరించె
  7. తా. నీళ్ళాడి కడువం గాంతయింటి కొనుటకై
  8. ము. బంచమని యింటఁ కల్గు బీభత్సునెఱిఁగి
  9. తా. యిచ్చగించుకొనుండ నేనెంత నేర్తు