పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


 బాడబరూపంబు ధరియించి మృత్తికాపతియందు శతధన్వుఁడను రాజును సేవించుచుం బెద్దకాలంబు మర్త్యలోకంబున నుండెననియును విందుము.

67


సీ.

జలజగర్భుని మానసంబు వేదంబులు
          దక్షప్రజాపతి దర్పకుండు
సౌదామనీవల్లి చంద్రికాలోకంబు
          సప్తజిహ్వ జ్వాలసప్తకంబు
రవిమయూఖములు నీరవని దుగ్ధాంభోధి
          మృత్యుదేవత[1]నోరి మెఱుఁగుఁబండ్లు
ముని కరిష్టాదేవికిని సంభవించిన
          దివ్యగంధర్వజాతిద్వయంబుఁ


గీ.

గారణంబులుగాఁ బుట్టినారు [2]పదియుఁ
నాల్గు కోట్లప్సరసలునా నాకసతులు
వారిలో నొక్కతెవు నీవు వారిజాక్షి
యేమి దుష్కృతిఁ బుట్టితోఁ హీనజాతి.

68


గీ.

తివుచుచున్నది భవదీయదృగ్విలాస-
మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు
వెనుక ద్రొబ్బుచునున్నాడు మనసిజాతుఁ
డేమి సేయుదుఁ జెప్పవే యిందువదన.

69


గీ.

వనిత నీ చిత్తమున కేను వత్తునేని
కామతంత్రంబునకు సంచకర్వు గాఁగఁ
జుంబనము సేయని మ్మోష్ఠబింబ మిపుడు
గండుఁగోయిల చిగురాకుఁ గమిచినట్లు.

70


గీ.

అనుచు విప్రుండు తమకించి యంటుకొనియె
సమ్మతించియ యుండె నా చంద్రవదన
శూకలాశ్వంబు నస రేఁపఁ జొచ్చినప్పు
డనుమతింపదె యత్తళువైన బడబ.

71


వ.

ధీరోదాత్త [3]యగుట నమ్మత్తకాశిని చిత్తజాయత్త యయ్యును దత్తఱపాటు లేక యతనితో నిట్లనియె.

72


సీ.

కలుగుచున్నవి యనేకములు వికల్పము
          లాడుచున్నవి యపాయంబు లెదుర
నంతరాయము లసంఖ్యములు గన్పట్టెడు
          సందేహములు పెక్కు చాయవాఱె
నంకురితములయ్యె శంక లేరాళంబు
          వికృతు లెన్నేని యావిష్కరించె
శాఖోపశాఖలఁ జాఁగుచున్నది రట్టు
          గుఱిలేక యుదయించె గోసనాస

  1. తా. నోర
  2. తా. మరియు
  3. తా. యగు