పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ముహూర్తమాత్రం బూరకుండె సుశీలాదేవియు.

109


సీ.

రవలయుంగరముల రత్నాంకురము లొత్తఁ
          గేల్దమ్మి చెక్కులఁ గీలుకొల్పి
మొకరితుమ్మెద మూతిముట్ట నోడెడి వేఁడి-
          నిశ్వాసపవనంబు నివ్వటిలఁగ
నాకర్ణదీర్ఘంబులగు క్రాలుఁగన్నులంఁ
          బరిపాటలచ్ఛాయ పల్లవింప
గంఠగోళంబు గద్గదికాను[1]బద్ధమై
          బాష్పభారంబు నిబ్బరము గాఁగఁ


గీ.

బక్ష్మములు జాఱి గండదర్పణము లొరసి
వ్రాలి పాలిండ్లపై నశ్రువాఃకణములు
హారలతలకు నాతిథ్య మాచరింప
గుబ్బతిల నేడ్చె [2]నొత్తిలి కువలయాక్షి.

110


వ.

ఇవ్విధంబునఁ దల్లియుఁ దండ్రియుఁ [3]దనకు హితోపదేశంబు చేసి తన సౌమనస్యసౌముఖ్యంబులతోఁ దగిన ప్రత్యుత్తరం [4]బీయమి నిర్వేదించుట యెఱింగి.

111


సీ.

ధర్మశాస్త్రాభ్యాసతాత్పర్యముననైన
          సంస్కార [5]మె ట్లౌరుసౌరు పడియె
నిరుపాధినిస్సీమనిర్నిబంధన[6]శక్తి
          గల మహాప్రతిభ యే కాటఁ గలసె
బంచేంద్రియ[7]విజయోపాయభూతములైన
          వినయంబు లే ప్రయోజనముఁ దీర్చె
నవయోవనాంకు[8]రోన్నతవంశదవమైన
          [9]శ్రుతివైభవం బేమి హితవు చేసె


గీ.

జిన్ని వయసున [10]గురులు శిక్షించినట్టి
పుణ్యవాసన నేల గోల్పోయె మనసు
కటకటా! నందనుండ [11]వొక్కఁడవ కల్గి
గురుల నేడ్పించుచున్నావు [12]కోరగమున.

112
  1. తా. బంధమై
  2. ము. నత్తఱి
  3. తా. తన కుచితోపదేశంబు
  4. తా. బీక నివేదించుట
  5. తా. మెప్డోరుసౌరు
  6. ము. వృత్తి
  7. తా. జయోపాయభూతములైన
  8. తా. శాహవపదమైన నీ; ము. శోన్నతవంశపదమైన
  9. ము. శ్రుతివైభవములేమి
  10. తా. ము. గురుల నీక్షించినట్టి
  11. ము. ఒక్కఁడవు నీవు
  12. ము. గోరముగను