పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          సత్కలాపంబులు జాఱవిడిచెఁ


గీ.

[1]సిగ్గుఁ బోకార్చెఁ గుక్కలఁ జేతఁబట్టె
[2]నిలిచియుండియు మూత్రించెఁ గలిసె లజ్జఁ
[3]గాలపరిపాటి ప్రారబ్ధకర్మవశతఁ
బయిసికొట్టనం బడియె నా బ్రాహ్మణుండు. [4]

102


వ.

ఇవ్విధంబునం దృగున్మీలనంబునం బోలె మార్గంబు దప్పి, జిహ్వాచ్ఛేదనంబునం బోలె మూఁగై, ఇంద్రజాలపింఛికాప్రచారంబునం బోలె తత్వం బెఱుంగక, ఊహజ్వరంబునం బోలె [5]నసంబద్ధంబు లాడుచు, లోకాయతవిద్యాభ్యాసంబుననుం బోలె నధర్మంబు మరగి, పైశాచగ్రహణంబునం బోలె గళవళింపుచు, మదనా వేశంబునం గావరంబెత్తి వర్తింపుచున్న సుకుమారు రావించి యజ్ఞదత్తుండు సుశీలాదేవి [6]సమక్షంబున వాని కిట్లనియె.

103


గీ.

అన్న సుకుమార! యేలయ్య యనుదినంబు
గొఱకుఁదనమున ధూర్తులఁ గూడి తిరిగె
దకట మీ యమ్మ గాంచె నిన్నధికనియతిఁ
గోరి వీరవ్రతంబున గొడ్డు వీఁగి.

104


సీ.

ఓరి నీకాచార్యుఁ డుపదేశ మిచ్చెనో
          దర్శించితెట్లు శాస్త్రములలోన
ధర్మం బుపార్జింపఁ దగిన మార్గమె యిది
          తపము వర్ధిల్లునే తనరఁ దీనఁ
గైవల్యపదవి యెక్కఁగవచ్చునే దీనఁ
          గంటె నాకమునకుఁ గారణముగఁ
గాదేని [7]నియమంబు క్రమమే యిది దలంప
          భవదుఃఖములు దీనఁ బాయుటెట్లు


గీ.

మూర్ఖుఁడైనను శిశువైన మూఢుఁడైన
దన కరిష్టంబుఁ దలఁచునే మనమునందు
నంతరహితుల యార్గురయందు ఘనుఁడు
మన్మథుఁడు దద్వికారంబు మాను మిపుడు.

105
  1. ము. దనకు మరగిన వారసుందరవనితల
  2. ము. నిరతసల్లాపసంభోగనిపుణతా సు-
  3. ము. ఖానురాగనిమగ్నుఁడై నిత్యకర్మమై తనర్చెను సుకుమారధరణిసురుఁడు(?)
  4. ఈభాగమున ముద్రితప్రతిలో నివియున్నవి.
    వ. ఇవ్విధంబునఁ గుమారుండు విహరింపఁజూచి.
    క. ప్రేమమునఁ గూర్చు సుతునకు
       వేమఱు సద్బుద్ధి చెప్ప వినమికి వగచున్,
       సామగ్ర్యదుర్గుణాళి క
       దా మధురత యొసఁగు విషమమగు చలమునకున్.
  5. తా. ఆ సంబంధంబు లాడుచు
  6. తా. సక్షమంబున
  7. తా. నియమక్రమంబేది