పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

మనమున కుత్సవం బొసఁగె మంత్రికిఁ [1]బట్టపుదేవి గర్భశో-
భనమునఁ [2]జేసి వెల్వెలఁగబారిన ముద్దుల నెమ్మొగంబుతో
ఘనసమయంబునందుఁ బొడకట్టిన చల్లని తూర్పుగాలిచే
ననిచిన కన్నెగేదఁగికి నచ్చిన కూరిమిచుట్టమో యనన్.

44


గీ.

గర్భభారాలసాంగియై కంబుకంఠి
చెవి శిరీషప్రసూనంబు [3]చేర్పనోప-
దెట్లు ధరియింపఁగానోపు హేమరత్న-
కంఠికాహారకేయూర[4]కటకములను.

45


క.

ఎలదోఁట తీఁగెయుయ్యెల
కలకంఠికిఁ [5]బిన్ననాఁటి కతలై తోఁచెం
జెలువకుఁ బాదాంబుజములు
[6]గిలిగింతలు వోవుఁ గేలిగిరివార్తలకు.

46


శా.

ఆ సారంగవిలోలలోచనను గాఢాలింగనక్రీడలన్
వాసాగారము కేలితల్పముపయిన్ మన్నించి మంత్రీశుఁ డ-
త్యా[7]సక్తిం జవిచూచు నెట్టుకొని మృత్స్నాస్వాదనప్రక్రియా
వ్యాసంగంబు[8]నఁ గమ్మనైన యదసీయంబైన బింబోష్ఠమున్.

47


క.

జలరుహనాభుని వక్షః-
స్థలికౌస్తుభమునను [9]మృడుని జడముడి నుడురా-
ట్కలికాలంకృతి వోలెం
బొలఁతుక ప్రత్యగ్రగర్భమున నొప్పారెన్.

48


వ.

ప్రతిదివసోప[10]చీయమానగర్భనిర్భర[11]యగు నయ్యాదిగర్భేశ్వరి కౌముదీ[12]మహోత్సవంబునఁ బ్రియసఖీవిలోచనచకోరి[13]కలం గోరికలు [14]నిండించి వెండియు.

49


చ.

బహుదినముల్ మహాసచివు [15]పట్టపుదేవికి వృద్ధిఁ బొందె దు-
స్సహనవగర్భ[16]సంగ్రహము [జాడ] సఖుల్ ప్రియమందఁగా ముహు-
ర్ముహురనుబద్ధజృంభితసముద్గతవిహ్వల[17]లోలనేత్రముల్
జహదజహత్సమగ్రపురుషాయితకేలివిజృంభణంబు[18]లై.

50
  1. తా. బట్టముదేవి
  2. ము. బల్చనై చెలువు పైకొను
  3. తా. ఁజతచనోప
  4. తా. కంకణములు
  5. ము. చిన్ననాఁటి
  6. ము. గిలిగింతలు గొలుపుఁ గేలిగిరిగుహలందున్
  7. ము. సంగంబొనరించె ముద్దుగొనె
  8. తా. ను
  9. ము. దీప్తిఁ దనరెడు మణిరా
  10. నీయమాన
  11. ము. యగుచు నయ్యది
  12. ము. విలసనంబునుం బోలెఁ
  13. ము. కలకుఁ
  14. ము. నిండించె
  15. తా. పట్టముదేవికి
  16. ము. చిహ్నములు చూచి
  17. ము. నేత్రపద్మముల్
  18. ము. లున్